https://oktelugu.com/

Shanmukh: ‘అరే ఎంట్రా ఇదీ’.. షణ్నును కావాలనే ఓడించారా?

Shanmukh: తెలుగు రియల్టీ షోల్లో బిగ్ బాస్ నెంబర్ వన్ షో గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ నిర్వహించిన నాలుగు సిరీసులు బుల్లితెర ప్రేక్షకులను అలరించడంతో ఐదో సీజన్ పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ లోకి పేరున్న సెలబ్రెటీలెవరు కూడా అడుగుపెట్టలేదు. బుల్లితెర స్టార్సే ఈసారి బిగ్ బాస్-5 సీజన్లో సందడి చేశారు. బిగ్ బాస్-5లో 19మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా టైటిల్ ఫేవరేట్ గా షణ్ముఖ్ జస్వంత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 20, 2021 / 10:52 AM IST
    Follow us on

    Shanmukh: తెలుగు రియల్టీ షోల్లో బిగ్ బాస్ నెంబర్ వన్ షో గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ నిర్వహించిన నాలుగు సిరీసులు బుల్లితెర ప్రేక్షకులను అలరించడంతో ఐదో సీజన్ పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ లోకి పేరున్న సెలబ్రెటీలెవరు కూడా అడుగుపెట్టలేదు. బుల్లితెర స్టార్సే ఈసారి బిగ్ బాస్-5 సీజన్లో సందడి చేశారు.

    Bigg Boss 5 Telugu

    బిగ్ బాస్-5లో 19మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా టైటిల్ ఫేవరేట్ గా షణ్ముఖ్ జస్వంత్ పేరు విన్పించింది. షార్ట్ ఫీలిమ్స్, డాన్స్ వీడియోలు చేస్తూ షణ్నుఖ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. దీంతో అతడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ లో అడుగుపెట్టినప్పుడు మెల్లిగా గేమ్ మొదలుపెట్టిన షణ్నుఖ్ క్రమంగా పుంజుకొని ఫినాలేకు చేరుకున్నాడు.

    టాప్-5లో షణ్నుఖ్ జస్వంత్ నిలువడంతో అతడే టైటిల్ నెగ్గుతారని అంతా భావించారు. కానీ ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్లో విజేతగా వీజే సన్నీ నిలువగా షణ్నుఖ్ రన్నర్ తో  సరిపెట్టుకున్నాడు. అయితే బిగ్ బాస్ కు ముందే సన్నీ ఎవరో కూడా చాలామంది తెలియదు. మరోవైపు షణ్నుఖ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

    ఈనేపథ్యంలోనే టైటిల్ ఫేవరేట్ గా సన్నీని ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షణ్నుఖ్ జస్వంత్ కు భారీగా ఓట్లు వచ్చినా కావాలనే అతడిని ఓడించారని అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కుట్రపూరితంగానే షణ్నుఖ్ ను గెలిపించలేదనే ఆరోపణలు చేస్తున్నారు.

    ఈ ఇష్యూపై షణ్నుఖ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బిగ్ బాస్ నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. సన్నీని కావాలనే బిగ్ బాస్ వాళ్లు గెలిపించారని ఆరోపిస్తున్నారు. ఈ షో స్క్రిప్ట్ ఆధారంగా నడుస్తుందని తెగ పోస్టులు చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ మాత్రం ఫైనల్లో షణ్ను కంటే సన్నీకే ఓట్లు ఎక్కువగా వచ్చాయని అందువల్లే అతడిని విజేతగా ప్రకటించినట్లు చెబుతున్నారు.

    దీంతో షణ్నుకు వ్యతిరేకంగా మిగతా కంటెస్టెంట్స్ ఏకమై అతడికి ఓటింగ్ రాకుండా కుట్రలు పన్నారా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి టైటిల్ ఫేవరేట్ గా నిలిచిన షణ్నుఖ్ రన్నర్ తో సరిపెట్టుకోగా ఏ అంచనాల్లేకుండానే సన్నీ బిగ్ బాస్-5 విజేతగా నిలువడం విశేషం. దీంతో అరే ఎంట్రా షణ్ను ఇది.. అంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.

    Tags