https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: ఇన్ఫ్లుయెన్సుర్ రవి నుండి బకరా రవి గా మారడానికి గల కారణాలేంటి

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో మొత్తానికి హోరా హోరి గా సాగుతుంది. బిగ్ బాస్ లో ఉన్న తొమ్మిది మంది కుటుంబ సభ్యులు టాప్ 5 లో చోటు సంపాదించుకోవడం కోసం పోటా పోటీగా కష్టపడుతున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుండి తగినంత పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోలేకపోతున్నారని ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే మొత్తం 19 మంది కంటెస్టెంట్ల ని నాగార్జున హౌస్ లో కి పంపగా ప్రస్తుతం తొమ్మిది […]

Written By:
  • NVN Ravali
  • , Updated On : November 20, 2021 / 08:17 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో మొత్తానికి హోరా హోరి గా సాగుతుంది. బిగ్ బాస్ లో ఉన్న తొమ్మిది మంది కుటుంబ సభ్యులు టాప్ 5 లో చోటు సంపాదించుకోవడం కోసం పోటా పోటీగా కష్టపడుతున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుండి తగినంత పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోలేకపోతున్నారని ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే మొత్తం 19 మంది కంటెస్టెంట్ల ని నాగార్జున హౌస్ లో కి పంపగా ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు.

    బిగ్ బాస్ 76 రోజులు పూర్తి చేసుకుని 100 రోజులకి చేరువుగా నిలిచింది. దగ్గర దగ్గరగా ఇంకొక 29 రోజుల ఆట మాత్రమే మిగిలే ఉంది. అయితే రానున్న రోజుల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకి గేమ్ మరింత కీలకంగా మారనున్నది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరూ తమకి తోచిన విధంగా ఆట ఆడుతూ తమ సత్తా తెలియపరచడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

    ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడం లో మంచి ప్రావిణ్యం ఉన్నది యాంకర్ రవికి. తనదైన స్ట్రాటజీస్ తో గేమ్ పాలన్ గీస్తూ భళా అనిపించేలా భలే చాకచక్యం గా గేమ్ ఆడతాడు రవి. అలాంటి రవి మొన్న జరిగిన నీ ఇల్లు బంగారం కాను అనే కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ లో శ్రీరామ చంద్ర చేతిలో బకరా అయ్యాడు. ఈ పాయింట్ ని వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున పాయింట్ అవుట్ చేస్తూ ఇప్పటి నుండి యాంకర్ రవి అని కాకుండా బకరా రవి అని పిలవడం మొదలు పెట్టాలి అంటూ చమత్కరించాడు.

    Tags