Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ యమ రంజుగా సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన కింగ్ నాగార్జున తొలి వారంలో పసందైన విందు చూపించారు. అలకలు, గొడవలు, కొట్లాటలతో వాడి వేడిగా సాగింది. తొలి వారంలోనే బూతులతో రెచ్చిపోయిన ‘సరయు’ నామినేట్ అయిపోయింది. ఇక రెండో వారం వచ్చేసింది.
రెండోవారంలో మొత్తం ఏడుగురు బిగ్ బాస్ నుంచి బయటకు పంపడానికి నామినేట్ అయ్యారు. శ్వేతవర్మ, ఉమాదేవి, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, అని మాస్టర్ లు రెండో వారంలో నామినేట్ అయ్యారు. వీరిలో అందరికంటే వివాదాస్పదంగా బూతులతో, పరుష పదాలు, గొడవలతో రెచ్చిపోతున్న ఉమాదేవి, శ్వేతవర్మలకు ఎలిమినేషన్ ముప్పు ఉందని అంటున్నారు.
మంగళవారం కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇంటిసభ్యులను రెండు టీంలుగా ‘వోల్ఫ్, ఈగల్’ విభజించారు. వారి కొన్ని వస్తువులు ఇచ్చి వాటిని కాపాడుకోవాలని కోరాడు. దీంతో ఈ ఫైట్ మొదలైంది.
కంటెస్టెంట్లు తమ ఆస్తులు కాపాడుకోవడానికి ఎదుటివారి లాక్కోవడానికి దారుణంగా పోరాడారు. ఆడవారు అని కూడా చూడకుండా వారి నుంచి లాగేసుకోవడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ సిరీ తన చెస్ట్ పై దాచుకున్న ఒక పిల్లోను ప్రత్యర్థి వర్గం కంటెస్టెంట్ సన్నీ వచ్చి పట్టుకొని ఆమె టీషర్ట్ లో పెట్టి మరీ దాన్ని తీసుకోవడం తీవ్ర దుమారం రేపింది.
అయితే సన్నీ మాత్రం తాను తీయకుండా తన టీంలోని అమ్మాయిలను పిలిపించి తీయించానని సమర్థించుకున్నాడు. కానీ సన్నీనే చేయిపెట్టాడని సిరీ ఆరోపించింది.
దీనిపై సిరి రచ్చ చేసింది. తన చెస్ట్ పై పెట్టుకున్న పిల్లోను సన్నీ తీశాడని గోల గోల చేసింది. ఇలా ఆడవాళ్లను అవమానిస్తారా? అని గళమెత్తింది. ఆమెకు అంతా సపోర్టు చేశారు.సన్నీ తన టీషర్ట్ లోపల చేయిపెట్టాడని సిరీ పెద్ద గొడవ చేసింది. చివరకు సన్నీ సారీ చెప్పినా.. తాను అలా చేయలేదన్నా కూడా వినలేదు ఆమె. ఇక ఈ గేమ్ లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిమీద ఒకరు పడిపోయి రచ్చరచ్చగా పిల్లోల కోసం ఎగబడ్డ తీరు అందరినీ షాక్ కు గురిచేసింది.