Bigg Boss 5 telugu: బిగ్ బాస్ రియాలిటీ షో పై అనేక అనుమానాలు, వివాదాలు ఉన్నాయి. సంప్రదాయవాదులు చాలా కాలంగా ఈ షోని వ్యతిరేకిస్తున్నారు. మన సంస్కృతికి వ్యతిరేకంగా ఒకే ఇంటిలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండడం, వాళ్ళ మధ్య శృతి మించిన రొమాన్స్, సమాజానికి చేటు చేస్తుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. గత సీజన్ ప్రారంభంలో హోస్ట్ నాగార్జున ఇంటి ముందు కొందరు ధర్నాలు కూడా చేశారు.

మరోవైపు ఈ షో అంతా స్క్రిప్ట్ డ్… కంటెస్టెంట్స్ గేమ్స్, ఎమోషన్స్, గొడవలు, కన్నీళ్లు… చివరికి ఎలిమినేషన్స్ కూడా, పద్ధతిగా నిర్వాహకులు ప్లాన్ ప్రకారం అమలు చేస్తారని కొందరి వాదన. దానికి ఇదే రుజువు అంటూ… తాజాగా జరిగిన ఓ సంఘటన గుర్తు చేస్తున్నారు. గత వారం హౌస్ నుంచి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. వైద్యుల సలహా మేరకు, అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీని హౌస్ నుండి బయటికి పంపారు.
ఆ వారం, రవి, సిరి, మానస్, కాజల్, సన్నీలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ముగ్గురు సేవ్ అయిన అనంతరం, చివరికి కాజల్, మానస్ మిగిలారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటే, సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీని బయటకు పంపి, వీళ్ళ ఎలిమినేషన్ రద్దు చేశారు. తీరా బయటికి వచ్చాక జెస్సీ తీరు చూస్తే అతడు, చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు.
ఈ సీజన్ లో పాల్గొన్న శ్వేతా వర్మతో పాటు బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆయనకు భారీ పార్టీ ఏర్పాటు చేశారు. విందులు, వినోదాలలో జెస్సీ భేషుగ్గా పాల్గొన్నాడు. బిగ్ బాస్ చెప్పినట్లు, అంత సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్ అతనిలో కనిపించలేదు. జెస్సీని హౌస్ నుండి బయటకు పంపాలని ముందుగానే నిర్ణయించిన నిర్వాహకులు, ఆ వారం ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని నామినేషన్స్ లో ఉంచి, ప్రేక్షకులలో ఉత్కంఠ కలిగేలా చేసి, చివరకు ట్విస్టు ఇస్తూ జెస్సీని బయటకు పంపారు.
Also Read: Cauli Flower Moive: ఎనీ టైమ్ శీలాన్నీ కాపాడే సింబల్ ని రా అంటున్న సంపూ… “కాలీ ఫ్లవర్” ట్రైలర్ రిలీజ్
కావున ఇదంతా స్క్రిప్ట్ షో అన్న అభిప్రాయం వెలువడుతుంది. మరోవైపు హోమ్ టౌన్ విజయవాడ చేరుకున్న జెస్సీకి ఘనస్వాగతం లభించగా.. అక్కడ ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Also Read: Sarkaru Vari Pata: ‘సర్కారు వారి పాట’ నుంచి ఇప్పట్లో ఎలాంటి అప్డేట్స్ లేనట్లేనా?