Big Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 టిఆర్పీ రేటింగ్ అదిరిపోతుంది. ఇంతలా ప్రేక్షాధరణ పొందిన ఈ బిగ్ బాస్ షో అసలు ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఏమిటంటే.. అమెరికాలోని ఎండిమోల్ సంస్థ వారి నిర్మాణంలో రూపొందిన బిగ్ బ్రదర్ అనే టీవీ షోకి కాపీగా పుట్టిందే బిగ్ బాస్. కొందరు ప్రముఖ వ్యక్తులను ఎంపిక చేసి, కొన్ని రోజుల పాటు వారిని ఒక ఇంటిలో వారి ఆమోదంతోనే నిర్భందించి, వారి దినచర్యలను కెమెరాలో షూట్ చేయడం ఈ షో ప్రత్యేకత. సమాజంలో ప్రముఖ వ్యక్తులు కాబట్టి.. సహజంగానే షో పై జనానికి ఆసక్తి పెరుగుతుంది.
అదే ఈ షో సక్సెస్ సీక్రెట్. పైగా ఇంటిలోని సభ్యులకు వివిధ పోటీలు నిర్వహించి, ఎట్టకేలకు ఆడియన్స్ ఓట్ల ద్వారా వారిలో ఒకరిని విజేతగా ప్రకటించి.. షోను ఇంకా బాగా జనంలోకి తీసుకువెళ్తారు. ఇక చివరగా విజేతలకు భారీ మొత్తంలో డబ్బు కూడా ముట్టజెప్పుతుంటారు. కాబట్టి సభ్యుల మధ్య గెలుపు కోసం గట్టి పోటీ ఉంటుంది. ఇక 2000 సంవత్సరంలో అమెరికన్ మీడియా సంస్థ సీబీఎస్ 20 మిలియన్ డాలర్లకు ఈ షో టెలికాస్ట్ హక్కులను కైవసం చేసుకుంది.
అమెరికాలో బిగ్ బ్రదర్ షో హిట్ అయ్యాక, దాదాపు 50 దేశాలలో వివిధ పేర్లతో ఎండిమోల్ సంస్థ ఇదే కాన్సెప్టుతో షోను తెరకెక్కించింది. భారతదేశంలో ఇదే సంస్థ ఎండిమోల్ షైన్ పేరుతో ఓ కంపెనీని రిజిష్టర్ చేయించి, బిగ్ బ్రదర్ పేరును ఇక్కడ కాస్త బిగ్ బాస్ గా మార్చింది. బిగ్ బాస్ షో ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ లాంటి భాషలలో కూడా టెలికాస్ట్ అవుతోంది.
16 మంది వ్యక్తులను సమాచార వ్యవస్థకు దూరం చేసి ఓ ఇంటిలో బంధించి వారి బాగోగులు బిగ్ బాస్ మాత్రమే చూస్తూ, ఒక కుటుంబం లాంటి ఆ గుంపు మధ్య వివాదాలు కల్పించి, వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ, ఈ ప్రహసనమంతా టీవీ ద్వారా ప్రేక్షకుడికి ఆనందం పంచే విధంగా డిజైన్ చేయడమే ఈ షో లక్ష్యం. కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పుకొనే మన దేశంలో డబ్బు కోసం రాజుగారి మోచేతి నీళ్లు తాగే బానిసలా బతకమని చెబుతున్న షో కూడా పాపులర్ అవ్వడం నిజంగానే ఆశ్చర్యమే.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bigg boss 5 telugu how was the big boss show born
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com