Bigg Boss 5 Telugu: అన్ని రకాల ఎమోషన్స్ కి కేరాఫ్ అడ్రెస్స్ బిగ్ బాస్. బుల్లి తెర పై దాదాపు గా నెల రోజుల నుండి సందడి చేస్తుంది. కచ్చితం గా రాత్రి 10 అయ్యేసరికి టీవీ ల ముందు అతుక్కు పోయేలా చేస్తుంది. ఏ ఒక్క ఎమోషన్ కి తావివ్వకుండా ఉగాది పచ్చడిలా అన్నీ ఎమోషన్స్ ని పండిస్తూ దూసుకెళ్లిపోతుంది. చిన్నా – చితకా, ముసలి – ముతకా, ఆడా – మగా అనే తేడా లేకుండా అన్నీ రకాల వర్గాల ప్రేక్షకులని మెప్పిస్తూ కనువిందు చేస్తుంది బిగ్ బాస్.

కామెడీ తో దూసుకెళ్తూ అందరిని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తుంది జబర్దస్త్. అలాంటి కామెడీ షో లేడీ గేటప్ లు వేసి తనదైన ముద్ర ప్రదర్శించాడు సాయి తేజ. ఆనతి కాలంలోనే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి అబ్బురపరిచాడు. అంతే కాకుండా తన పేరుని ప్రియాంకా సింగ్ గా మార్చుకున్నాడు.
అందరికి సాయితేజ గా తెలిసినప్పటికీ తనకి మాత్రం అమ్మాయి గా ఉండాలని అనిపించేదని చెప్పుకొచ్చింది ప్రియాంక. చిన్నతనం నుండి అక్క బట్టలు వేసుకోవాలని, ఎవరు లేనప్పుడు చీరలు కట్టుకోవాలని అనిపించేదట. ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా స్నేహితుల సహాయంతో లింగ మార్పిడి మార్పించుకుని ప్రియాంకా సింగ్ గా మారింది అని చెప్పుకొచ్చింది. కానీ, ప్రియాంక సింగ్ మాత్రం అబ్బాయి నుండి అమ్మాయిగా మారానని వాళ్ళ నాన్న కి మాత్రం చెప్పలేదు.
ఇదిలా ఉండగా అనుకోకుండా ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యి అందరి అభిమానాన్ని మూటకట్టుకుంటుంది ప్రియాంకా సింగ్. అయితే ప్రియాంక సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక వీడియో ని చూపించినట్ట్లు ఉన్నాడు బిగ్ బాస్. దానికి బిగ్ బాస్ మేట్స్, ప్రియాంక సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు చూపించాడు బిగ్ బాస్. ఇంతకీ ఆ వీడియో లో ఏం ఉందో చూడాలంటే గురువారం రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ కోసం, ఎదురు చూడాల్సిందే.