Bigg Boss 5 Telugu: చాలా రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఇటు ఆట పరంగా అటు కంటెంట్ పరంగా ది బెస్ట్ ఇస్తున్నారు. గడిచిన సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తమ పరిధి దాటి మరి ఆడటానికి ప్రయత్నం చేస్తున్నారు.

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో రవి, సన్నీ లను రాకుమారులుగా ప్రకటిస్తూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఈ తరుణం లో విడుదల చేసిన ప్రోమో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పై మరింత ఆసక్తిని పెంచుతోంది ప్రేక్షకుల్లో. ఏ రాకుమారునికి మద్దతు ఇవ్వాలో తెలియక మిగితా ఇంటి సభ్యులంతా గందరగోళానికి గురవుతున్నారు. హౌస్ లోని మెజారిటీ కుటుంబ సభ్యులంతా రవి కే మద్దతు పలుకుతున్నారు. ఇది లా ఉండగా… ‘నువ్వు నేను సన్నీ వైపు వెళితే తనే గెలుస్తాడు అంటూ సిరి, కాజల్ మాట్లాడుకుంటారు. మద్దతు ఇవ్వమని రవి, సిరి ని కోరగా… ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి ని సీరియల్ యాక్టింగ్ ఇక్కడ పనికి రాదు అని రవి సిరితో అంటాడు.
ఇక మానస్ తో రవి మాట్లాడుతూ…. నేను సన్నీ గురించి ఏం చెప్పను కానీ.. నువ్వు మాత్రం కెప్టెన్ అవ్వాలి అని అంటాడు. దానికి మానస్ బదులిస్తూ … ఇదంతా కాదు కానీ, నీలో ఫైర్ ఉంది, వడిలో ఫైర్ ఉంది.. బయట పెట్టండి అని రవి కి సమాధానం ఇస్తాడు. ఐదో వారానికి గానూ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో మరి ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్ అయ్యారు? అని తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే!