https://oktelugu.com/

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లు వీరే: ఈసారి ప్రముఖులు

తెలుగులోనే నంబర్ 1 రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ద్వారా పాపులర్ అయిన వారు ఎందరో ఉన్నారు. ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించి సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు.అందరు ప్రేక్షకులు ఆసక్తిగా చూసే బిగ్ బాస్ సీజన్ 5కి రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు స్టార్ మా టీవీ బిగ్ బాస్ 5 సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి చేసిందని టాక్. బిగ్ బాస్ 5వ సీజన్ కి కూడా ముహూర్తం ఖరారైంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2021 / 02:58 PM IST
    Follow us on

    తెలుగులోనే నంబర్ 1 రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ద్వారా పాపులర్ అయిన వారు ఎందరో ఉన్నారు. ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించి సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు.అందరు ప్రేక్షకులు ఆసక్తిగా చూసే బిగ్ బాస్ సీజన్ 5కి రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు స్టార్ మా టీవీ బిగ్ బాస్ 5 సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి చేసిందని టాక్. బిగ్ బాస్ 5వ సీజన్ కి కూడా ముహూర్తం ఖరారైంది. నిజానికి మే చివరి వారంలోనే ఈ సీజన్ కోసం ఇంటర్వ్యూలు , కంటెస్టెంట్ల వేట మొదలుపెట్టారు.

    ఇక హోస్ట్ విషయంలో గతంలో మాదిరిగానే మళ్లీ నాగార్జున కూడా ఉంటారని అంటున్నారు. అయితే కంటెస్టెంట్ల ఎంపిక జూమ్ యాప్ వేదికగా సాగిందని చెబుతున్నారు. ఇప్పటికే 16మందిని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి.

    సెప్టెంబర్లో 5వ సీజన్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈసారి కూడా రెండు వారాలు క్వారంటైన్ ఉంచి కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిస్తారట.. కంటెస్టెంట్లు ఎవరు అనే దానిపై రకరకాల వార్తలు వచ్చాయి. ఎవరెవరు ఉంటారనేదానిపై సస్పెన్స్ కొనసాగింది.

    బిగ్ బాస్ ప్రస్తుతం 16 మంది పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ ఉంటుందని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో మళ్లీ వాయిదా పడుతుందా..? అన్న సందేహాలు మొదలయ్యాయి. కానీ ఒక్కసారి కంటెస్టెంట్లు లోపలికి వెళితే ఇక 100రోజులు నిరాటంకంగా సాగించవచ్చని యోచిస్తున్నారు. పట్టాలెక్కించాలని నిర్వాహకులు రెడీ అవుతున్నారు.

    -బిగ్ బాస్ టీం ఎంపిక చేసిన వాళ్లు వీరేనని వార్తలు వెలువడుతున్నాయి.
    హైపర్ ఆది, శేఖర్ మాస్టర్ , సురేఖా వాణి, సినీ నటి ప్రియ, నటి యమున, యాంకర్ వర్షిణి, కమెడియన్ ప్రవీణ్ , టీవీ 9 యాంకర్ ప్రత్యూష, వరంగల్ వందన , సింగర్ మంగ్లీ , టిక్ టాక్ దుర్గారావు ,టిక్ టాక్ స్టార్ భాను, జస్వంత్ షణ్ముఖ్, యాంకర్ వర్షిణి, ఫన్ బకెట్ భార్గవ , ఫన్ బకెట్ శివ, జబర్దస్త్ వర్ష,