https://oktelugu.com/

Bigg Boss4: ఒకరిపై ఒకరు పంచ్ లేసుకున్న సుమ-నాగ్..!

‘బిగ్ బాస్’లో ఆదివారం వచ్చిందంటే ఎంటటైన్మెంట్ కు కొదవ ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదివారం ఎలిమినేషన్ పాటు ఏదో ఒక స్పెషల్ కార్యక్రమం చేయడం బిగ్ బాస్ కు అనవాయితీగా వస్తోంది. నిన్నటి ఎపిసోడ్లోనూ ‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటైన్మెంట్ చేశాడు. ఎపిసోడ్ ప్రారంభం నుంచి నుంచి చివరి వరకు బిగ్ బాస్-4 కార్యక్రమం ఆద్యంతం అలరించింది. బిగ్ బాస్-4లోకి యాంకర్ సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందంటూ హోస్టు నాగార్జున ఆమెను […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 9, 2020 / 12:07 PM IST
    Follow us on

    ‘బిగ్ బాస్’లో ఆదివారం వచ్చిందంటే ఎంటటైన్మెంట్ కు కొదవ ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదివారం ఎలిమినేషన్ పాటు ఏదో ఒక స్పెషల్ కార్యక్రమం చేయడం బిగ్ బాస్ కు అనవాయితీగా వస్తోంది. నిన్నటి ఎపిసోడ్లోనూ ‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటైన్మెంట్ చేశాడు. ఎపిసోడ్ ప్రారంభం నుంచి నుంచి చివరి వరకు బిగ్ బాస్-4 కార్యక్రమం ఆద్యంతం అలరించింది.

    బిగ్ బాస్-4లోకి యాంకర్ సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందంటూ హోస్టు నాగార్జున ఆమెను పిలిచాడు. కంటెస్టెంట్లకు సర్ ప్రైజ్ ఇస్తానంటూ కొద్దిసేపు ఆమెను పక్కన దాచిపెట్టాడు. కొద్దిసేపు కంటెస్టెంట్లతో మాట్లాడి సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందంటూ వారందరికీ షాకిచ్చాడు. దీంతో పలువురు కంటెస్టెంట్లు సర్ ప్రైజ్ కొందరు మాత్రం డల్ అయినట్లు కన్పించింది.

    సుమ బిగ్ బాస్-4 వేదికపై ఉన్నంత సేపు తనదైన మార్క్ ఎంటటైన్మెంట్ తో అలరించింది. సుమపై నాగ్.. నాగ్ పై సుమ పంచులు వేసుకంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మీరు.. మీ కోడలు యాంకరింగ్ చేస్తుంటే నాకు లోపలికి వెళ్లక తప్పడం లేదంటూ’ నాగ్ పై సుమ సెటైర్ వేసి నవ్వులు పూయించింది.

    బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ ఇమిటేట్ చేస్తూ అలరించింది. అందరిపై తనదైన పంచ్‌లు వేస్తూనే మధ్యమధ్యలో నాగార్జునను కూడా ఆడుకుంది. ఇక చివర్లో సుమను హౌస్ లోకి వెళ్తావా అని నాగార్జున అడగ్గా.. ఓకే సర్ అని చెప్పింది. బిగ్ బాస్ గేట్లు తెరవగా లోపలికి వెళ్లిన సుమ వెంటనే వేదికపైకి తిరిగొచ్చింది.

    త్వరలోనే వైల్డ్‌ డాగ్‌.. మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌.. ఆచార్య.. ఆర్‌ఆర్‌ఆర్‌ కు సంబంధించిన ప్రెస్‌ మీట్లు, ప్రీ రిలీజ్‌లు స్టార్ట్ కాబోతున్నాయని అందుకే లోపలికి వెళ్లడం లేదంటూ షాకిచ్చింది. దీంతో నాగ్ ‘బిగ్ బాస్’ను వదిలేస్తావా? అని ప్రశ్నించగా.. వెళ్తాను కానీ.. ఇప్పుడు కాదు సర్. గంగవ్వ వయస్సు వచ్చినప్పుడు లోపలికి వెళ్తానంటూ సమాధానమిచ్చింది. అంటే నెక్ట్స్ ఇయరే అన్నమాట అని నాగార్జున సుమపై పంచ్ వేశాడు. మొత్తానికి సుమ మార్క్ ఎంటట్మైనెంట్ బిగ్ బాస్ ప్రేక్షలతోపాటు నాగ్ ను సైతం ఖుషీ చేసింది.