బిగ్ బాస్-4.. ఈవారం ఆడొళ్లే హైలెట్..!

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 సీజన్ అలరిస్తోంది. ప్రారంభంలో చప్పగా సాగిన షో ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఐదువారాలకు పైగా గేమ్ పూర్తయింది. దీంతో కంటెస్టులు ఎవరికీవారు హౌస్ లో ఎక్కువ రోజులు ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికితోడు బిగ్ బాస్ కంటెస్టుల మధ్య గొడవలు పెట్టే టాస్కులు ఇస్తున్నాడు. Also Read: హాట్ టాపిక్:ఆ మూవీలో నటించే జంటలకు పెళ్లి అవుతుందా? కొద్దిరోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టులు చేస్తున్న విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. […]

Written By: NARESH, Updated On : October 16, 2020 4:06 pm
Follow us on

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 సీజన్ అలరిస్తోంది. ప్రారంభంలో చప్పగా సాగిన షో ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఐదువారాలకు పైగా గేమ్ పూర్తయింది. దీంతో కంటెస్టులు ఎవరికీవారు హౌస్ లో ఎక్కువ రోజులు ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికితోడు బిగ్ బాస్ కంటెస్టుల మధ్య గొడవలు పెట్టే టాస్కులు ఇస్తున్నాడు.

Also Read: హాట్ టాపిక్:ఆ మూవీలో నటించే జంటలకు పెళ్లి అవుతుందా?

కొద్దిరోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టులు చేస్తున్న విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటీవల వరుసగా ఆడ కంటెస్టులే బయటికి వెళుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు. దీంతో బిగ్ బాస్ నిర్వాహాకులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారమంతా ఆడ కంటెస్టులను హైలెట్ చేస్తూ చూపుతున్నారు. దీంతో ఈవారం బయటికి వెళ్లేది మగ కంటెస్టే అని అర్థమవుతోంది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న ఆడ కంటెస్టులంతా చాలా వీక్ గా ఉన్నట్లు కన్పిస్తోంది. దీంతోనే వరుసగా వాళ్లే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతున్నారు. అయితే వారం మాత్రం వారిని సేఫ్ చేసేందుకు బిగ్ బాస్ యత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ వారం లేడి కంటెస్టులను బిగ్ బాస్ హైలెట్ చూపించాడు.

తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో లాస్య.. హరిక.. అరియాలు తన చిన్ననాటి జ్ఞాపకాలు.. పర్సనల్ స్టోరీలను చూపించారు. ఇవన్నీ కూడా ప్రేక్షకుల్లో ఎమోషన్.. సింపతిని క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే వారికి ఓటింగ్ ఎడ్జ్ ఉండనుంది.

Also Read: కొత్త లుక్కులో ఆకట్టుకుంటున్న ‘కొమురంభీం’ ఎన్టీఆర్.!

వరుసగా లేడి కంటెస్టులు ఎలిమినేషన్ అవుతుండటంతో ఈవారం బిగ్ బాస్ మగ కంటెస్టుపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అనే ఆసక్తి నెలకొంది.