Bigg Boss 10 Promo Trolled: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ రియాలిటీ షో ఈ సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతుంది. గత సీజన్ అందరి అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో , ఈ సీజన్ పై అంచనాలు ఈ స్థాయిలో పెరగడానికి కారణం అయ్యాయి. ముఖ్యంగా ‘అగ్ని పరీక్ష’ షో ఒక సునామీ నే క్రియేట్ చేసింది. ఈ షో ద్వారా సామాన్యులుగా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ , బిగ్ బాస్ 9 ని సెన్సేషనల్ హిట్ చేశారు. అందుకే ఈ సీజన్ కి కూడా ‘అగ్నిపరీక్ష’ షో ని నిర్వహించబోతున్నారు. గత సీజన్ కి వేళల్లో దరఖాస్తులు వస్తే , ఈ సీజన్ కి లక్షల్లో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్లానింగ్ కూడా వేరే లెవెల్ లో ఉండేలా చూసుకుంటున్నారు.
ఇకపోతే రీసెంట్ గానే ‘బిగ్ బాస్ 10’ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో లో నాగార్జున ఎప్పటి లాగానే ఫుల్ జోష్ తో కనిపించారు. గ్రాండ్ గా బిగ్ బాస్ 10 లోగో ని కూడా ఆవిష్కరించారు. కానీ టెక్నీకల్ టీం లోపం కారణం గా ఈ ప్రోమో కి ఆడియో సరిగా లేదు. నాగార్జున గొంతు ప్రోమో లో సరిగా వినిపించడం లేదు. ఆ కారణం చేత, సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి టీం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత పెద్ద రియాలిటీ షో కి సంబంధించిన ప్రోమో ని కట్ చేస్తున్నప్పుడు కాస్త చూసుకోవాలి కదా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారో అర్థం కావడం లేదంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. త్వరలోనే ‘అగ్నిపరీక్ష’ కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేస్తారట. ఈ నెలలోనే షూటింగ్ కూడా మొదలు అవుతుందని టాక్.
ఇకపోతే ఈ షోకి ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చి , తిరుగులేని క్రేజ్, పాపులారిటీ ని సంపాదించుకున్న కళ్యాణ్ పడాల , డిమోన్ పవన్, శ్రీజ దమ్ము వంటి వారు కూడా ‘అగ్ని పరీక్ష 2’ లో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. వీళ్ళు ఈ షో లో మెంటార్స్ గా వ్యవహరించబోతున్నట్టు టాక్. అదే విధంగా ఈ షో కి జడ్జీలుగా శివాజీ, గీతా మాధురి, అభిజీత్ వంటి వారు వ్యవహరిస్తారట . యాంకర్ గా శ్రీముఖి నే ఉండబోతుంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ జాబితాలో పలువురు టాప్ సెలబ్రిటీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళే దాదాపుగా ఖరారు అయ్యినట్టు తెలుస్తోంది . ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ తో పాటుగా , ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఇందులో కనిపించబోతున్నట్టు సమాచారం, త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.
