Bigg Boss Season 10 Updates: కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ఈ ఏడాది సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కాబోతుంది. గత సీజన్ ఊహలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో , ee సీజన్ ని గత సీజన్ ని మరిపించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. ఈ నెల 12 న ప్రారంభించగా, 20 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ షో ద్వారా గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా సామాన్యులను ఎంచుకొని బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. 10 మంది సామాన్యులు , 10 మంది సెలబ్రిటీలు ఈ సీజన్ లో సందడి చేయబోతున్నారు అన్నమాట.
అయితే ఇప్పటికే పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ టీం ఇంకా ఎవరినీ ఖరారు చెయ్యలేదు , ప్రస్తుతానికి కేవలం సంప్రదింపులు మాత్రమే జరుపుతున్నారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే , ఈ సీజన్ లోకి ఇద్దరు హాట్ యాంకర్స్ రాబోతున్నారట. వాళ్ళు మరెవరో కాదు , వర్ష , వర్షిణి. ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా వర్ష కి వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా ‘బిగ్ బాస్ 9’ ఫైనలిస్ట్ ఇమ్మానుయేల్ తో ఈమె జోడి కి ఫ్యాన్స్ మాములుగా ఉండరు. వీళ్లిద్దరు కలిసి ఎన్నో వందల స్కిట్స్ , షోస్ చేశారు. ప్రస్తుతం వర్ష యాంకర్ గా కొనసాగుతోంది. ఈమెని రీసెంట్ గానే బిగ్ బాస్ టీం సంప్రదించారట, ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
ఇక ప్రధానంగా వినిపిస్తున్న మరో హాట్ యాంకర్ పేరు వర్షిణి. ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ ‘ ద్వారా ఎంత పాపులారిటీ ని సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుడిగాలి సుధీర్ , యాంకర్ ప్రదీప్, రష్మీ గ్యాంగ్ తో కలిసి ఈమె చేసిన అల్లరి ని అంత తేలికగా మన ఆడియన్స్ మర్చిపోలేరు. గత కొన్ని సీజన్స్ నుండి బిగ్ బాస్ టీం ఈమెని సంప్రదిస్తూనే ఉన్నారు. కానీ ఈమె ఎందుకో ఆసక్తి చూపించలేదు , కానీ ఈ సీజన్ లో మాత్రం ఈమె ఎంట్రీ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయట. ఎందుకంటే ఆమె కాదు అనలేని రెమ్యూనరేషన్ ని బిగ్ బాస్ టీం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈమె ఎంట్రీ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
