Ante Sundaraniki: అంటే సుందరానికీ బిగ్ షాక్… ఆ టాక్ ఏంటీ వచ్చిన కలెక్షన్స్ ఏంటీ?

Ante Sundaraniki: దాదాపు 30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన నాని కనీసం ఐదో వంతు కలెక్షన్స్ రాబట్టలేకపోయాడు. అంటే సుందరానికీ మూవీకి వచ్చిన టాక్ కి, వసూళ్లకు పొంతన లేకుండా పోయింది. జూన్ 10న అంటే సుందరానికీ మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేశారు. జూన్ 9 అర్థ రాత్రి నుండే యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. ఫస్ట్ షో నుండే అంటే సుందరానికీ సూపర్ హిట్ టాక్ దక్కించింది. సోషల్ […]

Written By: Shiva, Updated On : June 11, 2022 1:16 pm
Follow us on

Ante Sundaraniki: దాదాపు 30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన నాని కనీసం ఐదో వంతు కలెక్షన్స్ రాబట్టలేకపోయాడు. అంటే సుందరానికీ మూవీకి వచ్చిన టాక్ కి, వసూళ్లకు పొంతన లేకుండా పోయింది. జూన్ 10న అంటే సుందరానికీ మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేశారు. జూన్ 9 అర్థ రాత్రి నుండే యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. ఫస్ట్ షో నుండే అంటే సుందరానికీ సూపర్ హిట్ టాక్ దక్కించింది. సోషల్ మీడియాలో పలువురు పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. అంటే సుందరానికీ చిత్రం… 3 నుండి 3.5 వరకు అత్యధికంగా రేటింగ్ దక్కించుకుంది. ఈ చిత్ర ప్రోమోలు కూడా ఆకట్టుకున్న నేపథ్యంలో హీరో నానికి ఓ క్లీన్ హిట్ పడనుందని అందరూ భావించారు.

Ante Sundaraniki

అనూహ్యంగా అంటే సుందరానికీ మూవీ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. ఫస్ట్ డే ఈ చిత్ర ఓపెనింగ్స్ మేకర్స్ కి షాక్ ఇచ్చాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఐదో వంతు కూడా రాబట్టలేకపోయింది.ఫస్ట్ డే నైజాం లో అంటే సుందరానికీ రూ. 1.55 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాం లో నాని టార్గెట్ రూ. 10 కోట్లు. కనీసం వస్తే 11 కోట్లు బ్రేక్ ఈవెన్ అని చెప్పాలి. ఏపీలో ఈ సినిమా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అంటే సుందరానికీ సీడెడ్ హక్కులు రూ. 4 కోట్లకు విక్రయించారు. కాగా ఫస్ట్ డే అక్కడ వచ్చిన షేర్ రూ.0.44 కోట్లు. అంటే కేవలం పదో వంతు కలెక్షన్స్ వచ్చాయన్న మాట.

Also Read: No Head Masters In Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్ఎంలు ఉండరు.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఏపీ/తెలంగాణాలలో కలిపి అంటే సుందరానికీ చిత్రం రూ. 3.6 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం రూ . 25 కోట్లుగా ఉంది. వరల్డ్ వైడ్ అంటే సుందరానికీ ఫస్ట్ డే రూ. 6 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. అంటే మరో రూ. 25 కోట్ల షేర్ రాబడితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి చేరుతుంది. ఏపీ/ తెలంగాణతో పోల్చితే అంటే సుందరానికీ మూవీ ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తుంది. యూఎస్ లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది.

Nani

ఈ సినిమా భారీ నష్టాల నుండి బయటపడాలంటే.. శని, ఆదివారాలు కీలకం. ఈ రెండు రోజుల్లో అంటే సుందరానికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. సోమవారం నుండి విద్యాసంస్థలు కూడా ప్రారంభం కానున్నాయి. అలాగే వీక్ డేస్ లో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం కష్టం. విక్రమ్, మేజర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నాని సినిమాకు గట్టి పోటీ ఇస్తుండగా, ఏ మేరకు ఎదుర్కొని నిలబడుతుందో చూడాలి. నాని-నజ్రియా హీరోయిన్స్ గా మైత్రి మూవీ మేకర్స్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా అంటే సుందరానికీ నిర్మించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.

Also Read: Vallabhaneni Vamsi: గన్నవరంలో ‘మట్టి’ మంటలు.. వంశీకి చుక్కలు చూపిస్తున్న ప్రత్యర్థులు

Tags