Hari Hara Veera Mallu Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో, చివరికి ఫలితం ఎలాంటిది వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం జనరేషన్ లో ధర్మం కోసం యుద్ధం లాంటి సినిమాలు తీస్తే ఎంత పెద్ద పవర్ స్టార్ ని అయినా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విడుదలకు ముందు ఈ చిత్ర నిర్మాత AM రత్నం, ఇది పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా అంటూనే ప్రమోట్ చేశాడు.
Also Read: కొరటాల శివకు ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు..?
టీజర్,ట్రైలర్, పాటలు ఇలా అన్నిటిని 5 భాషల్లో విడుదల చేయించాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ సినిమాని మాత్రం అన్ని భాషల్లో విడుదల చేయలేకపోయాడు. కేవలం తెలుగు బాషలోనే ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలైంది. సినిమా విడుదల తర్వాత ఆ చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ హిందీ వెర్షన్ మీద ప్రస్తుతం పని చేస్తున్నాం, వచ్చే వారం లో నార్త్ ఇండియా లో విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. సనాతన ధర్మం కాన్సెప్ట్ మీద సినిమా తీస్తే మన ఆడియన్స్ బోరింగ్ గా ఫీల్ అవుతారేమో, కానీ నార్త్ ఇండియన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ని ఎగబడి మరీ చూస్తుంటారు. హిందీ లో రిలీజ్ చేయించి ఉండుంటే కచ్చితంగా ఈ చిత్రం అక్కడ హిట్ అయ్యేదేమో. ఎందుకంటే ఈ సినిమాని నెమ్మదిగా ఆడియన్స్ కూడా ఆదరించడం మొదలు పెడుతున్నారు.
Also Read: తెలుగు vs తమిళ డైరెక్టర్స్ లో ఎవరిది పై చేయి..
మొన్న ఆదివారం ఈ సినిమాకు అత్యధిక ప్రాంతాల్లో మ్యాట్నీ షోస్, ఫస్ట్ షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఒక డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకు 11 వ రోజు ఫుల్స్ పడడమా?, ఇదెక్కడి విచిత్రం బాబోయ్ అంటూ ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. కేవలం ఆదివారం మాత్రమే కాదు, సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి విజయవాడ వంటి ప్రాంతాల్లో రీసెంట్ గా విడుదలైన కింగ్డమ్ చిత్రం కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి. అంటే ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించడం మొదలు పెట్టారు అన్నమాట. ఇలాంటి సమయం లో హిందీ రిలీజ్ చేసి ఉండుంటే కచ్చితంగా వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడేవాళ్ళేమో?, బిజినెస్ జరగడం కోసం పాన్ ఇండియన్ సినిమా అంటూ ప్రచారం చేయడం, ఆ తర్వాత సమయం లేదని వదిలేయడం, ఇది రత్నం గారి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఈయనకి నమ్మి అవకాశం ఎలా ఇచ్చాడో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.