Star Hero wife : కఠిన ఆసనం వేసిన ఈ భామ ఓ స్టార్ హీరో వైఫ్… తెలిశాక మీ మైండ్ బ్లాక్ అవుతుంది!

మనోజ్-విష్ణు మధ్య సంబంధాలు తెగిపోయాయి. మంచు బ్రదర్స్ విభేదాలతో దూరమయ్యారు. మౌనికతో వివాహం, ఆస్తుల పంపకాలు ఈ గొడవలకు కారణమని తెలుస్తుంది.

Written By: Shiva, Updated On : June 22, 2023 4:33 pm

Bhuma Mounika

Follow us on

Star Hero wife : జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. పలువురు ప్రముఖులు ఈ రోజున యోగాసనాలు వేశారు. తమ ప్రతిభ ప్రదర్శించారు. ఓ స్టార్ హీరో వైఫ్ యోగాలో తన టాలెంట్ చూపించింది. కఠిన ఆసనమేసి తన స్కిల్స్ నిరూపించింది. ఆమె తన యోగా భంగిమకు సంబంధించిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో భార్య ఎవరో కాదు… భూమా మౌనిక. ఈ ఏడాది మార్చి నెలలో భూమా మౌనిక మంచు మనోజ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మౌనికకు యోగాలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆమె అనేక ఆసనాలు నేర్చుకుందట.

మౌనికకు యోగా వాళ్ళ అమ్మ శోభా నాగిరెడ్డి నేర్పారట. అందుకు ఈ లోకంలో లేని అమ్మను తలచుకుని, కృతజ్ఞతలు తెలిపింది. భూమా మౌనిక యోగా ఫోజ్ వైరల్ అవుతుంది. భూమా మౌనిక దివంగత పొలిటికల్ లీడర్స్ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కుమార్తె. పెద్దమ్మాయి అఖిల ప్రియ టీడీపీలో ఉన్నారు. ఆ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు. ఇక భూమా ఫ్యామిలీతో మంచు ఫ్యామిలీకి చాలా కాలంగా పరిచయం ఉంది. ఎప్పటి నుండో మనోజ్, మౌనిక ఫ్రెండ్స్.

కాగా ఇద్దరూ తమ భాగస్వాములతో విడిపోయారు. ఈ క్రమంలో ఇద్దరి మనసులు కలిశాయి. అయితే ఈ వివాహాన్ని మంచు ఫ్యామిలీ వ్యతిరేకించారు. పట్టుబట్టి మనోజ్ మౌనికను సొంతం చేసుకున్నారు. మనోజ్-మౌనికల వివాహం మంచు లక్ష్మి దగ్గరుండి నిర్వహించారు. ఆమె నివాసంలో మూడు రోజులు ఘనంగా జరిగింది. పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటల ముందు మోహన్ బాబు సతీసమేతంగా పెళ్లికి హాజరయ్యారు. విష్ణు మాత్రం దూరంగా ఉన్నారు.

మనోజ్-విష్ణు మధ్య సంబంధాలు తెగిపోయాయి. మంచు బ్రదర్స్ విభేదాలతో దూరమయ్యారు. మౌనికతో వివాహం, ఆస్తుల పంపకాలు ఈ గొడవలకు కారణమని తెలుస్తుంది. విష్ణు తనతో గొడవ పడుతున్న వీడియోను మనోజ్ నేరుగా సోషల్ మీడియాలో పెట్టాడు. అది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. మనోజ్ కొద్ది నిమిషాలకే ఆ వీడియో డిలీట్ చేశాడు. ఆ వీడియో ఓ రియాలిటీ షోలో భాగం అంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ జనాలు నమ్మలేదు. మనోజ్ ఇటీవల రెండు మూడు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. హీరోగా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నారు.