Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిలిచిన ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు..వరుస ఫ్లాప్స్ తర్వాత చిరంజీవి కి వచ్చిన భారీ హిట్ అవ్వడం తో మెగా ఫ్యాన్స్ మామూలు అనందం తో లేరు..అయితే ఒక భారీ హిట్ కొట్టాము అని ఆనందించే లోపే ఆ తర్వాతి చిత్రం ‘భోళా శంకర్’ ని చూసి నీరసించిపోయారు మెగా ఫ్యాన్స్.

కారణం అది రీమేక్ అవ్వడమే..2015 వ సంవత్సరం లో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది..అయితే ఈ సినిమాలో పెద్దగా స్టోరీ ఏమి ఉండదు..కేవలం అజిత్ మార్క్ అద్భుతమైన నటన వల్లే హిట్ అయ్యింది..ఆ సినిమా కేవలం అజిత్ కి మాత్రమే సూట్ అవుతుంది..ఇక ఏ హీరో కి కూడా అవ్వదు అని విశ్లేషకులు సైతం చెప్తూ ఉంటారు.
కానీ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చే ఇన్పుట్స్ ని సరిగ్గా ఫాలో అవుతూ సినిమా తీస్తే కచ్చితంగా సూపర్ హిట్ కొడుతారు అనేది ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉన్న టాక్..రీసెంట్ గా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రమే అందుకు ఉదాహరణ..అంతకు ముందు విడుదలైన ‘గాడ్ ఫాదర్’ చిత్రం కూడా చూసేందుకు బాగుంటుంది..ఆ సినిమాలో కూడా చిరంజీవి ఇన్పుట్స్ ప్రతీ సన్నివేశం లో ఉంటుంది..ఇప్పుడు మెహర్ రమేష్ తీస్తున్న ‘భోళా శంకర్’ పరిస్థితి కూడా అదే..ఈ సినిమాకి కూడా చిరంజీవి ఇన్పుట్స్ బాగా పనికి వస్తాయి అనే నమ్మకం తో ,’వాల్తేరు వీరయ్య’ ఫలితం చూసి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు అన్నీ ప్రాంతాల నుండి బయ్యర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
నిర్మాతలు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు..కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకే 100 కోట్ల రూపాయిల రేషియో లో బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం..ఆచార్య మరియు సైరా తర్వాత మెగాస్టార్ కెరీర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోబోతున్న సినిమా ఇదేనని అంటున్నారు.