Bhola Shankar
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర విడుదల ఆపివేయాలంటూ డిస్ట్రిబ్యూటర్ కోర్టులో కేసు వేశారు. భోళా శంకర్ నిర్మాతలు తనను మోసం చేసిన నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. విషయంలోకి వెళితే…. ఏజెంట్ చిత్ర హక్కులను డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ రూ. 30 కోట్లకు కొన్నారు.ఏజెంట్ ఆంధ్రా తెలంగాణా కర్ణాటక హక్కులను తనకు ఇస్తూ ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర డబ్బులు తీసుకున్నారట. అయితే చెప్పిన ప్రకారం అన్ని ఏరియాల హక్కులు సతీష్ కి ఇవ్వలేదట.
ఈ క్రమంలో అనిల్ సుంకర డిస్ట్రిబ్యూటర్ సతీష్ కి హామీ ఇచ్చారట. ఏజెంట్ మూవీ విడుదలయ్యాక నీకు ఇవ్వాల్సిన డబ్బు వడ్డీతో సహా చెల్లిస్తాను అన్నారట. లేదంటే తమ తదుపరి చిత్రం భోళా శంకర్ విడుదలకు 15 రోజులు ముందు డబ్బులు చెల్లించేలా అగ్రిమెంట్ చేశారట. భోళా శంకర్ విడుదల దగ్గరపడినా అగ్రిమెంట్ ప్రకారం అనిల్ సుంకర డబ్బులు చెల్లించలేదు. దీంతో అనిల్ సుంకర మీద చీటింగ్ కేసు నమోదు చేశారు.
అలాగే తన డబ్బులు చెల్లించే వరకు భోళా శంకర్ విడుదల ఆపివేయాలని కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం తెలియజేస్తూ డిస్ట్రిబ్యూటర్ సతీష్, తన లాయర్ తో పాటు వీడియో విడుదల చేశారు. భోళా శంకర్ విడుదల కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుందని సతీష్ లాయర్ అంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ దారుణ పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఏజెంట్ చిత్ర హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ సైతం భారీగా నష్టపోయారు.
ఇక అనిల్ సుంకర భోళా శంకర్ నిర్మాతగా ఉన్నారు. తమిళ చిత్రం వేదాళం హక్కులు కొని రీమేక్ చేశారు. ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. మెహర్ రమేష్ ఈ చిత్ర దర్శకుడు కాగా తమన్నా హీరోయిన్. కీలకమైన చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
On one Hand Distributors are waiting for 25/- hike from AP Government in order to Open Bookings
On the other hand, #Agent distributor Satish requested the court to Halt the release of #BholaaShankar (court hearing today)#Chiranjeevi pic.twitter.com/0yfkVvJVRb
— Daily Culture (@DailyCultureYT) August 9, 2023
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Bhola shankar in controversy break for release
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com