Homeఎంటర్టైన్మెంట్Bhimla Nayak: భీమ్లా నాయక్ హ్యాష్ ట్యాగ్ వైరల్.. ఫ్యాన్స్ సీరియస్ !

Bhimla Nayak: భీమ్లా నాయక్ హ్యాష్ ట్యాగ్ వైరల్.. ఫ్యాన్స్ సీరియస్ !

Bhimla Nayak:  ఎలాగైనా ఈ సంక్రాంతి బరిలో నేను దూకేస్తున్నా అంటూ ఆ మధ్య తెగ హడావిడి చేసిన భీమ్లా నాయక్ చిత్రం మొత్తానికి పొంగలి రేసులో నుంచి సైలెంట్ గా సైడ్ అయిపోయి.. మళ్ళీ చడీ చప్పుడు లేకుండా ఉంది. అసలు ఈ సినిమా మేకర్స్ ఏమి చేస్తున్నారు ? ఈ సినిమా ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పండి మహాప్రభో అంటూ పవన్ ఫ్యాన్స్ తెగ మెసేజ్ లు చేస్తూ ప్రాధేయ పడుతున్నారు.

Bheemla Nayak
Bheemla Nayak

కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ పై ఇంకా పెదవి విప్పడం లేదు. అయితే, ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొత్త తేదీని ప్రకటించింది. కానీ మళ్లీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అందుకే, పవన్ ఫ్యాన్స్ మేకర్స్ పై సీరియస్ అవుతున్నారు.

మాకు భీమ్లా నాయక్ నుంచి అప్డేట్ కావాలి అంటూ అభిమానులు మెసేజ్ లు పెడుతున్నారు. ఆ మెసేజ్ లకు మేకర్స్ నుంచి వచ్చే స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. అయినా టీమ్ నుంచి స్పందన లేదు. అందుకే తాజాగా భీమ్లా నాయక్ చిత్రం పై అప్డేట్ కావాలి అంటూ #Wewantbheemlanayakupdate అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను తెగ వైరల్ చేస్తున్నారు.

Bhimla Nayak
Bhimla Nayak

కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ హ్యాష్ ట్యాగ్ పై నాగ వంశీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version