Bheemla Nayak Promotional Song: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ‘భీమ్లా నాయక్’ ఈ నెల 25న రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేసి.. ప్రమోషన్ జోరు పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు అభిమానులను ఊర్రూతలూగిస్తుండగా.. ప్రమోషనల్ సాంగ్ మరింత ఊపు తెచ్చేలా ఉండనున్నట్లు టాక్. సాగర్ కె.చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు నాగవంశీ నిర్మాత.
ఇక ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. భీమ్లానాయక్ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం పై ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ విశ్వరూపం చూస్తారని, ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటుందని కూడా నాగవంశీ చెప్పిన సంగతి తెలిసిందే. పైగా రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి వరుసగా అదిరిపోయే న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
కాగా ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయని తెలుస్తోంది. ఇక థమన్ ఈ సినిమా అవుట్ ఫుట్ గురించి ఒక అప్ డేట్ ఇస్తూ.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ ఫుటేజీని చూశానని చెప్పాడు. కాగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్షన్ తనకు ఎంతో నచ్చిందని, ఆయన కెరీర్ లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని థమన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అంటూ థమన్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. అన్నట్టు సినిమా ఇన్ సైడ్ వర్గాల్లో ఈ సినిమా అద్భుతంగా వచ్చింది అని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా పవన్ నుంచి వస్తున్న క్రేజీ మూవీస్ లో ఇది కూడా ఒకటి.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More