పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా కాంబినేషన్లో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం భీమ్లనాయక్. ఇటీవలె విడుదలైన టైటిల్ సాంగ్ నెట్టింట ఓ ఊపు ఊపేసింది. ఆ జోరు కొనసాగుతుండగానే రెండో పాట ప్రోమో విడుదల చేసింది చిత్రబృందం. అక్టోబరు 15న ఉదయం 10.19గంటలకు పూర్తి సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలిపింది చి. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లె అందిస్తున్న ఈ మూవీకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
కాగా, ఇటీవలె విడుదలైన పవన్, రానా గ్లింప్స్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో భీమ్లనాయక్గా పవన్ పవర్ ఏంటో చూపించాడు. డానీగా వస్తోన్న రానా మళ్లీ తన మార్క్‌ను చూపించాడు. ఇద్దరి మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి తోడు విరామంలో వచ్చే ఫైట్ సీన్ సినిమాను మరో ఎత్తులో నిలబెడుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామేనన్ నటిస్తోంది. తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. కల్యాణ్‌కు జోడీగా నటించడం తొలిసారి. గ్లింప్స్‌తోనే సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయిన వేళ.. ట్రైలర్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ రేంజ్ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుందో లేదో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.
మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు టైటిల్‌తో చారిత్రక కథా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇటీవలె ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ప్రోమో సాంగ్ ఇదే..