https://oktelugu.com/

Bheemla Nayak: పలు సీన్లను రీ షూట్ చేయనున్న… భీమ్లా నాయక్ టీమ్

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర  దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 / 08:50 PM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర  దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కొన్ని యాక్షన్ సీన్లు ఉంటాయి. మలయాళం వెర్షన్ లో అయితే ఈ సన్నివేశాలే సినిమాకి హైలైట్ గా నిలిచాయి.
    తెలుగులో కూడా అదే రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. కథలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇంటిని రానా కూల్చేస్తాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. కానీ ఆ సన్నివేశాల ఔట్ పుట్ పట్ల మూవీ యూనిట్ సంతృప్తిగా లేరని సమాచారం. దీంతో ఇప్పుడు మరోసారి సదరు సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారు. ఇదంతా కూడా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కి భార్యగా నిత్యామీనన్ నటిస్తుండగా… రానా భార్య పాత్రలో సంయుక్త మీనన్ కనిపించనుంది.
    వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. మరి ఆ డేట్ కి సినిమాను విడుదల చేస్తారో.. లేక ‘ఆర్ఆర్ఆర్’ వస్తుందని వెనక్కి తగ్గుతారో చూడాలి. దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్,  రానా కలిసి ఉండే  టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.