Akhanda- Bheemla Nayak Box Office Collections: ఈ సమ్మర్ టాలీవుడ్ కు ఊపు వచ్చింది. భీమ్లానాయక్ గ్రాండ్ హిట్ తో జోష్ వచ్చింది. మూడు పెద్ద సినిమాలు త్వరలో విడుదలకు క్యూలో ఉన్నాయి. అన్నింటికంటే ముందర భీమ్లా నాయక్ వచ్చింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రానున్నాయి. నెలరోజుల గ్యాప్ లోనే ఇవన్నీ థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పై బోలెడు అంచనాలున్నాయి. సర్కారి వారి పాట కూడా బోలెడు అంచనాలతో వస్తోంది. ఈ నాలుగు సినిమాల బడ్జెట్ కలిపితే ఏకంగా 1100 కోట్ల రూపాయలు అవుతుంది.

సినిమాలలో కొన్ని అంశాలు చూస్తే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లు ప్యాన్ ఇండియా మూవీలుగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదివరకూ రిలీజ్ అయిన అఖండ, పుష్పలను మించి ‘భీమ్లానాయక్’ సినిమా కలెక్షన్లు సాధించడంతో ఇక ఆ సినిమాకు తిరుగులేదని అర్థమవుతోంది.
Also Read: బన్నీ, పవన్, ఎన్టీఆర్ రికార్డులను బద్దలు కొట్టిన ప్రభాస్ !
ఇప్పటికే కరోనా ముగిశాక ‘అఖండ’ ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది. ఆ తర్వాత పుష్ప హిట్ గా నిలిచింది.పుష్పకు బాలీవుడ్ లో, టాలీవుడ్ లో పోటీలేకపోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే క్లైమాక్స్ సరిగా లేకపోవడం.. లుక్స్ మరీ భయంకరంగా వెటకారంగా ఉండడం.. రెండు పార్టులుగా మారడం పుష్ప మూవీకి మైనస్ గా మారింది.
ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కు ప్యాన్ ఇండియా స్థాయిలో బజ్ ఉంది. చరణ్, ఎన్టీఆర్ హీరోలు కావడం.. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తుండడంతో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఆడియో పెద్దగా ప్రేక్షకుల అంచనాలు అందుకోకపోవడం మైనస్ గా మారింది. కథ చూస్తే చరిత్రను జక్కన్న వక్రీకరిస్తున్నారని ఆరోపణలున్నాయి.
ప్రభాస్, పూజాల రాధేశ్యామ్ కు హిందీలో భారీ అంచనాలున్నాయి. లవ్ స్టోరీ, పాటలు, ఫీల్ గుడ్ మూవీ అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాకు ప్లస్ గా మారింది. అయితే యాక్షన్ సీన్ లు లేకపోవడం మైనస్ అంటున్నారు.

ఇక భీమ్లా నాయక్ మూవీ విషయానికి వస్తే కొదమ సింహాల్లాంటి హీరోలు రానా, పవన్ లు నటిస్తుండడం..పైగా మలయాళ హిట్ మూవీ రిమేక్ కావడంతో సినిమా సక్సెస్ అయ్యి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక పాటలు అదిరిపోయేలా ఉండడంతో సినిమాకు హైప్ వచ్చింది. తొలి వారం భీమ్లానాయక్ 180 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. ఇక పుష్ప మూవీ తొలివారంలో ప్యాన్ ఇండియా లెవల్ లో 151 కోట్లు సాధించింది. ఇక బాలకృష్ణ ‘అఖండ’ మూవీ తొలి వారం 77.75 కోట్లు రాబట్టింది. దీన్ని బట్టి ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాకున్నా తెలుగు నాట భీమ్లానాయక్ పుష్ప, అఖండలను మించేసినట్టు అర్థమవుతోంది.
Also Read: భీమ్లానాయక్ లో పిచ్చెక్కిస్తున్న త్రివిక్రమ్ డైలాగులు ఇవే.. ఎన్నాళ్లకు గురూజీ..!
Recommended Video:

[…] […]
[…] Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed: విష్వక్ శెన్ : యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రాబోతుంది. కాగా మార్చి 4న విడుదల కావాల్సిన అశోకవనంలో అర్జున కల్యాణం చిత్రం వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ విభిన్నంగా, వినోదాత్మకంగా తెలిపారు. ‘అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చి 4న పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తాం’ అంటూ ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. […]
[…] Also Read: అఖండ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానా… […]
[…] Heroine Trisha Marriage: సీనియర్ బ్యూటీ త్రిష వయసు రెండు నెలలు తక్కువ 39 సంవత్సరాలు. అంటే, కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటూ ఉండేది. కానీ పెళ్లి వేళ రాలేదు, ఇంకా త్రిషకే పెళ్లి కాలేదు. ఒకపక్క త్రిష పెళ్లి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజానిజాల పరిస్థితి ఏమిటయ్యా అని ఎంక్వైరీ చేస్తే.. త్రిషకు ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నారు. […]