Bhavana Childhood Photos: ఈ ఫొటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?,ఈమె తెలుగు లో కేవలం రెండు మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. కానీ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పాత్రల్లో మెరిసింది. ఇప్పటి జనరేషన్ కి చెందిన వాళ్ళు కూడా ఈమెను తేలికగా గుర్తు పట్టగలరు. ఈమె కెరీర్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుండి మొదలైంది. అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యాక తమిళం లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా తమిళం, మలయాళం లో సినిమాలు చేస్తూ సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు తెలుగు లో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత కన్నడ లో కొన్ని సినిమాలు, హిందీ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అలా చూస్తూ ఉండగానే అన్ని భాషల్లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ గా ఎదిగింది.
ఆమె మరెవరో కాదు, భావన(Bhavana). ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ఒంటరి అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ తర్వాత మహాత్మా అనే చిత్రం లో చేసింది. ఈ రెండు సినిమాల ద్వారా ఆమెకు వచ్చిన గుర్తింపు సాధారణమైనది కాదు. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే కన్నడ స్టార్ నిర్మాత నవీన్ అనే అతన్ని పెళ్లాడింది. పెళ్లి తర్వాత ఈమె సినిమాలను ఆపేస్తుందని అంతా అనుకున్నారు కానీ. తన పీక్ కెరీర్ ని మాత్రం వదలలేదు. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికీ నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక తమిళ సినిమా, ఒక మలయాళం సినిమా,మూడు కన్నడ సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఈమె నుండి ‘ది డోర్’ అనే తమిళ చిత్రం మాత్రమే విడుదలైంది. మరో రెండు సినిమాలు పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా, మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Also Read: వచ్చే వారం ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్.. పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు!
తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది కానీ, తెలుగు లో మాత్రం సినిమాలు చేయడం లేదు. దర్శక నిర్మాతలు ఎవ్వరూ ఈమెని పరిగణలోకి తీసుకోవడం లేదో,లేకపోతే ఈమె మన సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించడం లేదో తెలియదు కానీ ,చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయి లాగా కనిపించే భావన మళ్ళీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు ఆమెని అభిమానించేవాళ్ళు. 2002 వ సంవత్సరం లో కెరీర్ ని మొదలు పెట్టి , ఇన్ని రోజులు విరామం లేకుండా సినిమాలు చేస్తూ ఒక హీరోయిన్ మనుగడ సాగించడం ఈరోజుల్లో అంత తేలికైన విషయం కాదు. కానీ భావన సక్సెస్ అయ్యింది. రాబోయే రోజుల్లో ఆమె ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయబోతుందో చూడాలి.