Bhavadeeyudu Bhagat Singh: గబ్బర్ సింగ్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో అధికారికంగా ప్రకటించబడ్డ చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’..పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది..అయితే లేటెస్ట్ గా వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కి అంతగా నచ్చలేదట.

తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన ‘తేరి’ మూవీ ని తన స్టైల్ కి మార్చి గబ్బర్ సింగ్ రేంజ్ లో మార్పులు చేసి తీసుకొని రా..ఆ సినిమా మనం చేద్దాము అని హరీష్ శంకర్ కి చెప్పాడట పవన్ కళ్యాణ్..హరీష్ శంకర్ ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ని రెడీ చేసేలా పనిలో ఉన్నాడు..కానీ ఎంతో ఇష్టంగా రాసుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా కథ ని మూలాన పెట్టాల్సిందేనా అనే నిరాశలో ఉన్నాడట హరీష్ శంకర్.
అయితే ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటి అంటే మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారు..ఇప్పుడు హరీష్ శంకర్ ని తీసుకొని ముంబై కి వెళ్లారట..అక్కడ రెండు రోజుల నుండి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని కలవడానికి వేచి చూస్తున్నారట..విషయం ఏమిటి అంటే ఈ ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రం స్టోరీ ని సల్మాన్ ఖాన్ కి వినిపించి ఆయన ఒప్పుకుంటే ఆయనతో ఈ సినిమా చెయ్యడానికి తెగ ప్రయత్నిస్తున్నారట హరీష్ శంకర్ మరియు నవీన్.

ఇది పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఏ మాత్రం నచ్చలేదు..మా హీరో కి స్టోరీ నచ్చకపోతే ఆయనకీ నచ్చే విధంగా కథలో మార్పులు చెయ్యాలి కానీ..ఇలా మా హీరో కథని వేరే హీరో తో చేయించాలని చూస్తావా..ఇది న్యాయం కాదంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ హరీష్ శంకర్ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ తిడుతున్నారు..మరి దీనికి హరీష్ శంకర్ రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.