Bhartha Mahasayulaku Wignyapthi OTT delay: ఈ సంక్రాంతికి కానుకగా విడుదలైన చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku Wignapti) చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ రవితేజ గత చిత్రాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడం వల్ల, ఈ సినిమా బాగుందని చెప్పినా ఆడియన్స్ నమ్మలేదు. ఫలితంగా రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ చిత్రంగా నిల్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఎంతైనా రవితేజ సినిమా, పాజిటివ్ టాక్ కూడా వచ్చింది, థియేటర్స్ లో చూడలేకపోయాం, కనీసం ఓటీటీ లో అయినా చూడాలి అని ఓటీటీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 13 న ఈ చిత్రం విడుదల అవ్వాలి. కానీ ఇప్పటి వరకు అవ్వలేదు. కనీసం ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అనే విషయాన్ని కూడా చెప్పలేదు.
‘జీ5’ సంస్థ ఈ చిత్రాన్ని మంచి రేట్ కే కొనుగోలు చేసింది. థియేటర్స్ లో ఈ సినిమాని చూసి ఆడియన్స్ సంఖ్య తక్కువే కాబట్టి, ఓటీటీ లో ఎగబడి చూస్తారనే నమ్మకం జీ5 యాప్ వాళ్లకు కూడా ఉంది. అయినప్పటికీ ఎందుకు విడుదల చేయలేదో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 13 మిస్ అయ్యింది, కనీసం ఫిబ్రవరి 20 న, అనగా రేపు అయినా విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు నెటిజెన్స్. కానీ జీ5 సంస్థ నుండి ఎలాంటి చప్పుడు లేదు. ఇదంతా చూస్తుంటే అసలు ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తారా లేదా అనే సందేహాలు ఆడియన్స్ లో వ్యక్తం అవుతున్నాయి. నిర్మాతలతో ఇంకా ఏమైనా లావాదేవీలు జరగాల్సినవి ఉన్నాయా?, నిర్మాతలు ఎక్కువ ప్రైజ్ అడగడం తో ‘జీ5’ సంస్థ వెనకడుగు వేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈమధ్య కాలం లో ఓటీటీ సంస్థలు నిర్మాతలకు అడ్వాన్స్ అయితే ఇస్తున్నారు కానీ, వాళ్ళు కోరినంత అడ్వాన్స్ ఇవ్వాలంటే మాత్రం థియేటర్స్ లో ఆ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వలేదు కాబట్టి ఒప్పందం ప్రకారం అనుకున్న రేట్ కి సగం డబ్బులు మాత్రమే ‘జీ5’ సంస్థ చెల్లించాలి. కానీ అందుకు నిర్మాతలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. వీళ్లిద్దరి మధ్య వ్యవహారం సర్దుకునేవరకు ఈ సినిమా ఓటీటీ లో విడుదల అవ్వడం కష్టమే. ఇకపోతే ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, కేవలం 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే థియేటర్స్ నుండి రాబట్టింది ఈ చిత్రం.