Bhartha Mahasayulaku Wignyapthi 3 Days Collections: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తూ వస్తున్న మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja), ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయుల విజ్ఞప్తి'(Bharta Mahasayulaku Wignapti Movie) చిత్రం తో మన ముందుకొచ్చాడు. రొటీన్ సినిమా అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ, కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని, ఈమధ్య కాలం లో విడుదలైన రవితేజ సినిమాలన్నిటికంటే ఇదే బెస్ట్ గా ఉందని, కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే మంచి టాక్ బయటకు వచ్చింది. కానీ ఈ సినిమా కంటే ‘అనగనగా ఒక రాజు ‘, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలకు ఇంకా మంచి టాక్ రావడం తో ఆడియన్స్ ఆ చిత్రాలకే ఎక్కువ మొగ్గు చూపించారు. ఫలితంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కి టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ చిత్రానికి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. సంక్రాంతి విడుదల కాబట్టి ఇది చాలా తేలికైన టార్గెట్ అని అంతా అనుకున్నారు. కానీ రోజువారీ కలెక్షన్స్ ని చూస్తుంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కష్టమే అని అనిపిస్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, సంక్రాంతి పండుగ రోజున, అనగా మూడవ రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా కోటి 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయట. ఓవరాల్ గా మూడు రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. నైజాం ప్రాంతం నుండి 1 కోటి 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కోస్తాంధ్ర ప్రాంతం మొత్తానికి కలిపి ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లో 2 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా మొదటి మూడు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 36 లక్షల రూపాయిలు రాగా, ఓవర్సీస్ నుండి 75 లక్షల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 5 కోట్ల 61 లక్షలు షేర్ వసూళ్లు, 9 కోట్ల 65 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ మూడు రోజులు కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జనవరి 26 వరకు 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. మరి బ్రేక్ ఈవెన్ 20 కోట్ల టార్గెట్ ని అందుకోవడం మాత్రం ప్రస్తుతానికి కష్టమే.