Homeఎంటర్టైన్మెంట్Bhartha Mahasayulaku Wignyapathi Twitter Review: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..నెటిజెన్స్ నుండి...

Bhartha Mahasayulaku Wignyapathi Twitter Review: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..నెటిజెన్స్ నుండి ఇలాంటి రియాక్షన్ ఊహించలేదు!

Bhartha Mahasayulaku Wignyapathi Twitter Review: ధమాకా తర్వాత వరుసగా 7 డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని కెరీర్ లో అతి కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) , రొటీన్ కి భిన్నంగా, తన రెగ్యులర్ ఇమేజ్ ని పక్కన పెట్టి, తన ఎనర్జీ ని కాస్త డౌన్ చేసి నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku Vignapti Movie). రవితేజ కెరీర్ లో అసలు సినిమా ఉందో లేదో తెలియని […]

Bhartha Mahasayulaku Wignyapathi Twitter Review: ధమాకా తర్వాత వరుసగా 7 డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని కెరీర్ లో అతి కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) , రొటీన్ కి భిన్నంగా, తన రెగ్యులర్ ఇమేజ్ ని పక్కన పెట్టి, తన ఎనర్జీ ని కాస్త డౌన్ చేసి నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku Vignapti Movie). రవితేజ కెరీర్ లో అసలు సినిమా ఉందో లేదో తెలియని రేంజ్ హైప్ తో విడుదల అయిన చిత్రమిది. పెద్ద పెద్ద సిటీస్ లో సైతం ఈ చిత్రానికి కేవలం రెండు నుండి మూడు షోస్ మాత్రమే దక్కుతున్నాయి అంటే నమ్ముతారా?, ఆ రేంజ్ కి పడిపోయింది రవితేజ మార్కెట్. కానీ టీజర్, ట్రైలర్ వంటివి చూసిన తర్వాత ఈ చిత్రం పై ఒక సెక్షన్ ఆడియన్స్ లో హైప్ ఏర్పడింది. అందుకే ఇంత లో బజ్ లో కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

అలా తక్కువ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ఆడియన్స్ ని ఆకట్టుకుండా లేదా?, రవితేజ కనీసం ఈసారైనా హిట్ కొట్టాడా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని చూసిన నెటిజెన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఈమధ్య కాలం లో విడుదలైన రవితేజ సినిమాల్లో ది బెస్ట్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ బిల్డింగ్ కి ఎలాంటి సెటప్ లేదని, చాలా బలహీనమైన స్టోరీ లైన్ అని, కానీ కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. అక్కడక్కడా స్క్రీన్ ప్లే లో డ్రాప్స్ ఉన్నాయి , అదే విధంగా కొన్ని సన్నివేశాలు ఓవర్ గా ఉన్నాయి కానీ, ఎక్కడా కూడా బోరింగ్ మూమెంట్స్ లేవని, చక్కగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా అని అంటున్నారు.

ఇక సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని, సాంగ్స్ బాగా కుదిరాయని, స్క్రీన్ ప్లే లో తర్వాత ఏమి జరగబోతుందో ప్రతీ ఒక్కరు కనిపెట్టగలరు కానీ, ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా డీసెంట్ గా ఉందని అంటున్నారు. అయితే కొత్తధనం ఊహించి వెళ్తే మాత్రం కచ్చితంగా నిరాశకు గురి అవ్వాల్సిందే. సంక్రాంతికి కుటుంబం తో కలిసి కాసేపు థియేటర్ లో కూర్చొని నవ్వుకుందాం అని అనుకునేవాళ్లకు ఈ చిత్రం కచ్చితంగా సరిపోతుందని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ చిత్రానికి బ్రహ్మరథం పట్టడం మొదలుపెట్టేశారు. ఆ సినిమాకు టికెట్స్ దొరకని వాళ్ళు, రవితేజ సినిమాని రెండవ ఛాయస్ గా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి కమర్షియల్ గా ఈ చిత్రం ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper