Ravi Teja Remuneration: 2012 వ సంవత్సరం వరకు మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ ఉండేది. రవితేజ కాల్ షీట్స్ దొరికితే చాలు వరం అని అనుకునేవాళ్లు అప్పటి నిర్మాతలు. ఎందుకంటే ఆయన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చాయి. సక్సెస్ శాతం అధికంగా ఉండేది. రవితేజ సినిమా అంటే మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక బ్రాండ్ అనే ఇమేజ్ ఉండడం వల్లే ఇదంతా సాధ్యమైంది. కానీ 2015 వ సంవత్సరం నుండి రవితేజ పతనం మొదలైంది. ఈ పదేళ్లలో ఆయనకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి. కానీ అంతకు మించిన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ కారణం చేత ఆయన స్టార్ హీరో స్టేటస్ ని పూర్తిగా కోల్పోయాడు.
‘ధమాకా’ చిత్రం తో రవితేజ కెరీర్ లో మొదటిసారి వంద కోట్ల గ్రాస్ సినిమాని చూసాడు. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ప్రతీ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన మాస్ జాతర చిత్రం కూడా వర్కౌట్ అవ్వలేదు . ఇప్పుడు రవితేజ నుండి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku vignapti Movie) అనే చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ మరియు చిత్రలహరి వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా కి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా డీసెంట్ స్థాయిలోనే జరిగింది. కానీ రవితేజ ఈ చిత్రానికి ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. ఈ విషయాన్నీ కాసేపటి క్రితమే ఆ చిత్ర నిర్మాత అధికారిక ప్రకటన చేసాడు.
ఏ హీరో అయినా సినిమా ఒప్పుకున్న వెంటనే ఎంతో కొంత అడ్వాన్స్ అందుకుంటారు. కానీ రవితేజ ఈ చిత్రానికి నయా పైసా అడ్వాన్స్ కూడా తీసుకోలేదట. సినిమా విడుదల అయ్యాక, కమర్షియల్ గా సక్సెస్ సాధించిన తర్వాతనే తనకు రెమ్యూనరేషన్ ఇవ్వమని నిర్మాతలకు చెప్పాడట. వరుసగా ఆయన సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ రావడం వల్ల, ఎక్కడో తేడా జరుగుతుంది అని భావించి రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే డబ్బింగ్ కూడా చెప్పను అని మొండికేసే స్టార్ హీరోలు ఉన్న ఈ ఇండస్ట్రీ లో, ఇలా పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చి, ఆయనకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఉండాలని రవితేజ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.