https://oktelugu.com/

Bharateeyudu 2 : భారతీయుడు 2 శౌర సాంగ్ రివ్యూ: తెల్లోడి రక్తంతో కత్తికి పదునెట్టు, గూస్ బంప్స్ రేపుతున్న విజువల్స్!

భారతీయుడు 2లో కమల్ హాసన్ పాత్ర తీరును వివరించించేదిగా ఉంది. విజువల్స్ ఉన్నతంగా ఉన్నాయి. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 22, 2024 / 09:30 PM IST
    Follow us on

    Bharateeyudu 2 : 1996లో వచ్చిన భారతీయుడు ఓ విజువల్ వండర్. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన చిత్రం అది. ఒకప్పటి ఫ్రీడమ్ ఫైటర్ నేటి కాలంలో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేస్తే ఎలా ఉంటుందనేది కథ. దర్శకుడు శంకర్ అద్భుతమైన స్క్రీన్ ప్లే, సన్నివేశాలు రాసుకున్నారు. మర్మకళ అనే ఓ పురాతన యుద్ధ విద్యను కూడా పరిచయం చేశాడు. ఇక ఏ ఆర్ రెహమాన్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. వెరసి సిల్వర్ స్క్రీన్ పై ఓ మిరాకిల్ ఆవిష్కృతం అయ్యింది.

    కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేయగా మనీషా కోయిరాలా, ఊర్మిళ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది భారతీయుడు 2. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దర్శకుడు శంకర్ ఆ చిత్రానికి కొనసాగింపుగా భారతీయుడు 2 తీశారు. అయితే భారతీయుడు 2 చిత్రీకరణలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. సెట్ లో ప్రమాదం జరిగిన ఒకరు మరణించారు. నిర్మాత-దర్శకుడి మధ్య విబేధాలు తలెత్తి మూవీ షూటింగ్ ఆగిపోయింది.

    విక్రమ్ మూవీ సక్సెస్ తో కమల్ హాసన్ తిరిగి ఫార్మ్ లోకి వచ్చాడు. దాంతో భారతీయుడు 2 నిర్మాతలు శంకర్ తో కంప్రమైజ్ అయ్యారు. మరలా ఈ చిత్రం పట్టాలెక్కింది. జులై 12న భారతీయుడు 2 విడుదల కానుంది. ఈ క్రమంలో ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. అనిరుధ్ మ్యూజిక్ అందించిన శౌర సాంగ్ అద్భుతంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ గొప్ప సాహిత్యం అందించారు.

    భారతీయుడు 2లో కమల్ హాసన్ పాత్ర తీరును వివరించించేదిగా ఉంది. విజువల్స్ ఉన్నతంగా ఉన్నాయి. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. భారతీయుడు 2 కోసం ఆడియన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఒకప్పటి క్లాసిక్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.