Allu Arjun : భార్యతో పాటు అల్లు అర్జున్ చేసిన పనికి అందరూ షాక్… సంచలన ఫోటో వైరల్

ఈ వీడియో అప్పట్లో సంచలనం రేపింది. వందల కోట్ల సంపాదన ఉండి కూడా అల్లు అర్జున్ చాలా సింపుల్ గా ఉంటారని ఈ పరిణామాలతో తెలిసి వచ్చింది. ఇక పుష్ప 2 ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది.

Written By: NARESH, Updated On : May 22, 2024 9:38 pm

Allu Arjun's work with his wife Snehareddy shocked everyone

Follow us on

Allu Arjun : అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. సదరు ఫోటో చూసి నెటిజన్స్ అవాక్కు అవుతున్నారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందో చూద్దాం. అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. పాన్ ఇండియా హీరో కూడాను. నార్త్ లో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 కోసం నార్త్ ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో కంటే కూడా ఇతర భాషల్లో పుష్ప 2పై హైప్ ఉంది.

ఇక సినిమాకు అల్లు అర్జున్ దాదాపు రూ. 100 కోట్లు వరకు తీసుకుంటున్నారు. వందల కోట్ల ఆస్తి అల్లు అర్జున్ కి ఉంది. అయితే ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. సాధారణ జీవితాన్ని ఇష్టపడతారు. అనేక సంఘటనలు ఇది నిరూపించాయి. తాజాగా.. అల్లు అర్జున్ ఓ దాబా లో భోజనం చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అల్లు అర్జున్ ఇటీవల నంద్యాల వెళ్లారు. అక్కడి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి తన మద్దతు తెలిపాడు.

భార్య స్నేహారెడ్డితో పాటు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వస్తూ అల్లు అర్జున్ భోజనం ఓ దాబా లో చేశారు. ఆ దాబాలో కనీస సౌకర్యాలు లేవు. సాదాసీదాగా ఉన్న దాబాలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి భోజనం చేశారు. అంత పెద్ద హీరో ఓ చిన్న దాబాలో భోజనం చేయడంతో నెటిజెన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

గతంలో పుష్ప 2 షూటింగ్ నల్లమల ఫారెస్ట్ లో జరిగింది. అప్పుడు పక్కనే ఉన్న పల్లెటూరి హోటల్ లో అల్లు అర్జున్ టిఫిన్ చేశాడు. తాటాకుల పూరి గుడిసెలో నడుపుతున్న హోటల్ లో ఆయన బ్రేక్ ఫాస్ట్ చేశాడు. ఈ వీడియో అప్పట్లో సంచలనం రేపింది. వందల కోట్ల సంపాదన ఉండి కూడా అల్లు అర్జున్ చాలా సింపుల్ గా ఉంటారని ఈ పరిణామాలతో తెలిసి వచ్చింది. ఇక పుష్ప 2 ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది.