Bhanupriya : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగిన వారే కావడం విశేషం… ఇక అలనాటి అందాల తారలలో ‘ భానుప్రియ’ (Bhanu Priya)ఒకరు. చూడడానికి చాలా అందంగా ఉండే భానుప్రియ తన అభినయంతో చాలామంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకుంది. ఇక ఒకానొక సమయంలో స్టార్ హీరోలందరితో నటించిన ఆవిడ ఒక స్టార్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే వంశీ… లేడీస్ టైలర్, సితార, అన్వేషణ లాంటి సూపర్ హిట్ సినిమాలను తీసిన వంశీ భానుప్రియను ప్రేమించాడు. ముఖ్యంగా భానుప్రియ తో ఆయన ఎక్కువ సినిమాలను చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో అయితే కుదిరింది. ఇక క్రమంగా అది ఫ్రెండ్షిప్ గా మారి ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించుకున్నారనే వార్తలైతే బయటికి వచ్చాయి. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే మరి కొన్ని వార్తలు వచ్చినప్పటికి అవి నిజమైతే అవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే భానుప్రియ వాళ్ళ అమ్మ తను వంశీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ చెప్పి ఆమెను వంశీ సినిమాల్లో నటించకుండా చేసిందట. అందువల్లే ఆమె వంశీ ని పెళ్లి చేసుకోలేదంటూ అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఇటు భానుప్రియ, అటు వంశీ ఇద్దరు కూడా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు…మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఒక హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో ఆమె కొన్ని రోజులపాటు ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ మదర్ గా నటించే అవకాశం రావడంతో తను సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేసింది. వరుసగా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగింది.
ఇక ప్రస్తుతం అయితే సినిమాలు చేయకుండా బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా భానుప్రియ లాంటి నటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా వెలుగొందినప్పటికి అలాంటి నటి జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే ఎవ్వరూ నమ్మరు.
మరి ఏది ఏమైనా కూడా డైరెక్టర్ వంశీ కూడా భానుప్రియ తో పెళ్లి కాకపోవడం వల్లే ఆయన కొంతవరకు డిప్రెషన్ లోకి వెళ్ళాడని ఆ తర్వాత మంచి సినిమాలు చేయలేకపోయారంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ వాటికి చెక్ పెడుతూ కొన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన సినిమాలు చేయలేదని చెప్పడం విశేషం…