Homeఎంటర్టైన్మెంట్Konda Movie: రామ్ గోపాల్ వర్మ "కొండా" మూవీ నుంచి సాంగ్ రిలీజ్...

Konda Movie: రామ్ గోపాల్ వర్మ “కొండా” మూవీ నుంచి సాంగ్ రిలీజ్…

Konda Movie: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యో యో టాకీస్ పతాకం పై మల్లా రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలు గా అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నిర్మించబడుతున్నచిత్రం “కొండా”. వరంగల్ లోని కొండా మురళి మరియు కొండా సురేఖ గార్ల జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్న చిత్రం “కొండా”. కొంతకాలం నక్సలిజం నీడలో గడిపి, ఆపైన రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజానాయకుడిగా ఎదిగిన కొండా మురళీ జీవన ప్రయాణం నేపధ్యంలో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదిత్ అరుణ్, ఇరా మోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కొండా’ షూటింగ్ ను కొద్ది రోజుల క్రితం వరంగల్ లో శరవేగంగా జరుగుతుంది. అయితే ఊహించని ఇబ్బందుల కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో షెడ్యూల్‌ చేయలేకపోయామని వర్మ అన్నారు.

Konda Movie
bhale bhale song released from ram gopal varma konda movie

Also Read: పుష్పకు కష్టాలు మొదలయ్యాయి.. అల్లు అర్జున్ స్వయంకృపరాధం!

కొంత భాగం బయట చిత్రీకరించిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో మళ్ళీ వరంగల్ లోనే షూటింగ్ చేస్తున్నామని వర్మ చెప్పారు. ఈ సినిమా కోసం సిరాశ్రీ రాసిన ‘భలే భలే’ అనే విప్లవ గీతాన్ని వరంగల్ గద్దర్ తో కలిసి వర్మ పాడారు. ఈ మేరకు తాజా ఈ సాంగ్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా వర్మ ఈ పాటను అభిమానులతో పంచుకున్నారు. కాగా 1980వ సంవత్సరం జరిగిన ఘటన ఆధారంగా కొండా సురేఖ, మురళి ప్రేమ కథకు కాస్త మసాలా యాడ్ చేసి ఈ సినిమా చేస్తున్నాడు. ఇక కొండా మురళికి నక్సలైట్ ఆర్కే తో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి కూడా సినిమాలో ప్రత్యేకమైన సీన్స్ ఉంటాయట. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Bhale Bhale Song | Ram Gopal Varma & Nalgonda Gaddar | Konda Movie | Adith Arun, Irra Mor

Also Read: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పుట్టినరోజు నేడు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version