Bhairavam : చాలా కాలం గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరో గా నటించిన చిత్రం ‘భైరవం'(Bhairavam Movie). తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే సమయం లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ చేసిన కామెంట్స్ కూడా బాగా వివాదాస్పదంగా మారాయి. అవన్నీ పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీ సిద్ధమైపోయింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ టీం తో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో నిన్న ఈ చిత్రాన్ని చూసాడు. ఆయనకు తెగ నచ్చేసింది. అప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాము అనే రేంజ్ ఊపులో ఆయన సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
సినిమా అద్భుతంగా వచ్చింది అనే ఆనందం బెల్లంకొండ శ్రీనివాస్ లో కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత సినిమా చేసినప్పటికీ మంచి చిత్రం తోనే రీ ఎంట్రీ ఇచ్చి ఉంటాడని బెల్లంకొండ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే సినిమా విడుదలై గ్రాండ్ సక్సెస్ అయ్యాక చేసుకోవచ్చు కదా ఈ సంబరాలు, అప్పుడే ఎందుకు అతి కాకపోతే అని బెల్లంకొండ ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో మూవీ లో పని చేసిన ప్రతీ ఒక్కరి మాటలు వింటుంటే సినిమా చాలా బాగా వచ్చింది అనేది అర్థం అవుతుంది.
Also Read : ఒకపక్క మెగా ఫ్యాన్స్.. మరోపక్క వైసీపీ ఫ్యాన్స్.. పాపం ‘భైరవం’ పరిస్థితి ఏంటో!
ఈ చిత్రం బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) కెరీర్స్ కి ఎంతో ముఖ్యం. ఎందుకంటే వీళ్ళు కూడా సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది. ఈ చిత్రం తోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ వెర్షన్ ని బట్టీ చూస్తే ఇందులో మనోజ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా తమిళ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ నటించింది. ఓవరాల్ గా ఈ చిత్రం మంచి మాస్ మసాలా యాక్షన్ చిత్రం గా తెరకెక్కినట్టు అనిపిస్తుంది. హిట్ అయితే పది రోజుల పాటు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేయొచ్చు. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది.
Success celebrations even before the film's release. First of its kind! #Bhairavam pic.twitter.com/iQreR9X1cY
— Aakashavaani (@TheAakashavaani) May 27, 2025