Housefull 5 Trailer : బాలీవుడ్ లో ఫ్రాంచైజ్ హవా మామూలు రేంజ్ లో ఉండదు. అక్కడ ఈమధ్య కాలంలో అత్యధిక శాతం ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తున్నవి ఫ్రాంచైజ్ నుండి వచ్చినవే. అలా బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్’ అనే కామెడీ మూవీ ఫ్రాంచైజ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్ నుండి నాలుగు సినిమాలు వచ్చాయి. నాలుగు కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుండి వచ్చే నెలలో 5వ సినిమా రాబోతుంది. మొదటి నుండి ఈ ఫ్రాంచైజ్ లో అక్షయ్ కుమార్(Akshay Kumar), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), రితేష్ దేశముఖ్(Riteish Deshmukh) నటిస్తూ వచ్చారు. ‘హౌస్ ఫుల్ 5′(House Full 5) లో కూడా ఈ ముగ్గురు కలిసి నటించారు. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.
Also Read : కశ్మీర్ రాత మార్చాడు.. ‘పఠాన్’ విజయాన్ని పరోక్షంగా ఒప్పుకున్న మోడీ
ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫ్రాంచైజ్ నుండి ఎలాంటి ఎలిమెంట్స్ ని అభిమానులు కోరుకుంటారో, అలాంటి ఎలెమెంట్స్ అన్నిటిని పొందుపర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఇండియా వైడ్ గా అడల్ట్ రేటెడ్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మనమంతా చూస్తూనే ఉన్నాం. యూత్ ఆడియన్స్ ఎక్కువగా అవే కోరుకుంటున్నారు. ఈ చిత్రం లో కూడా అడల్ట్ రేటెడ్ కామెడీ డైలాగ్స్ బాగా పెట్టినట్టుగా అనిపించింది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ని చూస్తే మనకు వెంటనే విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘F3’ చిత్రం గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో ఆస్తి కోసం ఒక మిలినియర్ కొడుకుగా ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి అడుగుపెడతారు. మేమే అసలు వారసులం అంటూ అబద్దాలు ఆడుతారు. ఈ చిత్రం కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కినట్టు ట్రైలర్ ని చూస్తే అనిపిస్తుంది.
69 బిలియన్ల అతి గల ఒక వ్యక్తి తన వందవ పుట్టిన రోజున ఒక షిప్ లో ఏర్పాటు చేసిన పార్టీ లో తన ఆస్తికి వారసుడు ‘జాలీ’ అని చెప్తాడు. ఈ విషయం దేశమంతటా పాకడం తో మేమే జాలీ అని అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశముఖ్ ఎంట్రీ ఇస్తారు. ఇదే పార్టీ లో ఆ బిలినియర్ మర్డర్ కి గురి అవుతాడు. ఆ మర్డర్ ఈ ముగ్గురే చేసినట్టు అందరూ భావిస్తారు. ఈ విషయం లో విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్స్ గా సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ ఎంట్రీ ఇస్తారు. అలా సినిమా మొత్తం ఫన్నీ ఎలిమెంట్స్ తో నిండిపోయినట్టు ఈ ట్రైలర్ ని చూస్తే తెలుస్తుంది, అదే సమయంలో మన అనిల్ రావిపూడి సినెమాలన్నిటిని మిక్స్ చేసి తీసినట్టుగా కూడా అనిపిస్తుంది. చూడాలి మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ బాలీవుడ్ లో ఎంతమేరకు సక్సెస్ సాధించబోతుంది అనేది.