Bhairava vs Khaleja Clash : ఈమధ్య కాలం లో కొత్త సినిమాలకంటే మన ఆడియన్స్ రీ రిలీజ్ చిత్రాలను బాగా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu) పాత సినిమాలు రీ రిలీజ్ అయితే ఆ వారం మీడియం రేంజ్ హీరోల కొత్త సినిమాలు విడుదలైతే మటాష్ అన్నమాట. ఆడియన్స్ ఆ కొత్త సినిమాకంటే వీళ్ళ పాత సినిమాల రీ రిలీజ్ కి ఎక్కువ కదులుతున్నారు. అందుకు రీసెంట్ ఉదాహరణ గా నిల్చింది మహేష్ బాబు ‘ఖలేజా'(Khaleja Movie) చిత్రం. మే 30వ తారీఖున ఈ చిత్రం తో పాటు ‘భైరవం’ చిత్రం కూడా విడుదలైంది. ‘భైరవం'(Bhairavam Movie) చిత్రానికి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్లేదు అనే రేంజ్ లో వచ్చాయి. కానీ మహేష్ బాబు ‘ఖలేజా’ చిత్రం లేకపోయుంటే కచ్చితంగా ఈ చిత్రానికి ఇంకా కాస్త ఎక్కువ ఓపెనింగ్ వచ్చి ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.
Also Read : సందీప్ రెడ్డి vs దీపిక గొడవను ప్రభాస్ కూల్ చేశాడా..?
భైరవం చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 4 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 8 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 5 కోట్ల 8 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది బ్రేక్ ఈవెన్ మార్కుకి ఏ మాత్రం సారిపోదనే చెప్పాలి. ఈరోజు నుండి భారీ స్థాయి హోల్డ్ ని సొంతం చేసుకుంటే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం. ఎందుకంటే వచ్చే వారం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతుంది. ఆ సినిమా కోసం ఈ చిత్రాన్ని అన్ని సెంటర్స్ నుండి తొలగించేస్తారు.
అప్పటి వరకు ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి రన్ ఉంటే 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని. లేకపోతే కేవలం పది కోట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా ఎటు చూసినా బయ్యర్స్ కి 5 నుండి 7 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఖలేజా సినిమా విడుదల లేకపోయుంటే ఆడియన్స్ కి మొట్టమొదటి ఛాయస్ గా ఈ చిత్రమే ఉండేది. అప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో కూడా కొనసాగితే ఇక మీద కొత్త సినిమాలు విడుదల ఉన్న సమయం లో రీ రిలీజ్ లు ఉండరాదనే రూల్ పెట్టినా పెట్టొచ్చు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో వచ్చారు. ప్రొమోషన్స్ కూడా ఎంతో డెడికేషన్ తో చేశారు. అయినప్పటికీ ఫలితం రాకపోవడం బాధాకరం.