Hari Hara Veera Mallu Producer Decision : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సరిగా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదల అవ్వబోతున్న చిత్రమిది. అభిమానులు ఈ చిత్రం కోసం దాదాపుగా ఐదేళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు కేవలం పది రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ ఇంకా క్లోజ్ కాకపోవడం, థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాకపోవడం పై అభిమానుల్లో తీవ్ర స్థాయి అసంతృప్తి నెలకొంది. ట్విట్టర్ లో నిర్మాతను ట్యాగ్ చేసి ఇష్టమొచ్చినట్టుగా తిట్టేస్తున్నారు. అయితే బిజినెస్ ఇంకా క్లోజ్ అవ్వకపోవడానికి గల కారణాన్ని రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు AM రత్నం. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : ఖలేజా’ మేనియా లో కొట్టుకుపోయిన ‘భైరవం’..హిట్ టాక్ తో కూడా బ్రేక్ ఈవెన్ కష్టమే?
యాంకర్ ఆయన్ని ప్రశ్న అడుగుతూ ‘ఈ చిత్రానికి బిజినెస్ ఇంకా పూర్తి అవ్వలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా?’ అని అడగ్గా, దానికి సమాధానం చెప్తూ ‘తక్కువకి ఇవ్వాలని అనుకుంటే ఒక్క క్షణం లో బిజినెస్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాకు బిజినెస్ విషయం లో ఎలాంటి సంకోచం ఉండదు. కానీ ఇది చాలా భారీ సినిమా. మా అంచనాలకు తగ్గ రేట్స్ వచ్చే వరకు ఆడుతున్నాం అంతే. సాధారణంగా ఒక సినిమా బిజినెస్ థియేట్రికల్ ట్రైలర్ ని చూసి చేస్తారు. మాది ట్రైలర్ ఆలస్యం అయ్యింది. అందుకే ట్రైలర్ వచ్చిన తర్వాతనే బిజినెస్ ని క్లోజ్ చెయ్యాలని అనుకున్నాను. ఇప్పటికే అద్భుతమైన ఆఫర్లు వచ్చాయి. కానీ మాకు బడ్జెట్ కి తగ్గ ఆఫర్లు రావాలి. జనాల్లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. కానీ బయ్యర్స్ మాత్రం హీరోల గత చిత్రాలను చూసి మాత్రమే బిజినెస్ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు AM రత్నం.
వాస్తవానికి ఈరోజుకే దాదాపుగా బయ్యర్స్ జాబితా ఖరారైంది. నిర్మాత AM రత్నం కూడా ఫిలిం ఛాంబర్ కి టికెట్ రేట్స్, స్పెషల్ షోస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఉదయం నాలుగు గంటల ఆట నుండి ప్రారంభం కాబోతుందట. థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 5 లేదా 6 వ తేదీలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో అభిమానుల కోసం ఈ ట్రైలర్ ని ప్రదర్శించే ఆలోచనలో కూడా ఉన్నాడట AM రత్నం. ట్రైలర్ అద్భుతంగా ఉంటుందని, సినిమా పై అంచనాలను అమాంతం పెంచేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరి అభిమానుల ఆకలి ని ఈ సినిమా ఎంత వరకు తీరుస్తుందో చూడాలి.