Bhagyashri Borse: ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం తో రామ్ చరణ్(Global Star Ram Charan) అభిమానులను ఎంతటి నిరాశకు గురి చేశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత శంకర్ దర్శకత్వం లో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. అదే రేంజ్ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది'(Peddi Movie) పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎందుకంటే చాలా కాలం తర్వాత రామ్ చరణ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా, ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చి బాబు, ఇప్పుడు ‘పెద్ది’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదటి నుండి మంచి పాజిటివ్ అంచనాలు ఉన్న ఈ సినిమా పై ‘గ్లింప్స్’ వీడియో ఆ అంచనాలను రెట్టింపు అయ్యేలా చేసింది. ఇక ఎప్పుడైతే ‘చికిరి..చికిరి’ పాట విడుదల అయ్యి గ్లోబల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో, అప్పటి నుండి ఈ చిత్రం పై అభిమానులు కలలో కూడా ఊహించని హైప్ క్రియేట్ అయ్యింది. ఇలా ఈ చిత్రం నుండి వస్తున్న ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆటం బాంబు లాగా వెళుతోంది. ఇక ఇలాంటి సినిమాల్లో అభిమానులు కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాలని కోరుకుంటారు కదా. ఈ విషయం బుచ్చి బాబు కి కూడా తెలుసు. అందుకే ఈ సినిమాలో అదిరిపోయే రేంజ్ ఐటెం సాంగ్ ని పెట్టాడట. ఈ ఐటెం సాంగ్ కోసం ఎంతో మంది హీరోయిన్స్ ని సంప్రదించారు.
కానీ చివరికి భాగ్యశ్రీ భొర్సే ఫిక్స్ అయ్యిందట. ఈ ఒక్క ఐటెం సాంగ్ కోసం ఆమె దాదాపుగా మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుందని సమాచారం. ఇప్పటి వరకు ఈమె మూడు సినిమాలు చేస్తే, మూడు కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఈ రేంజ్ డిమాండ్ చేస్తుందంటే, ఆమెకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక పెద్ది షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే, ఢిల్లీ లో ఈ నెల 18 నుండి నాలుగు రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారట. అదే విధంగా ఐటెం సాంగ్ తో పాటు, ఒక్క భారీ యాక్షన్ సన్నివేశం మరియు క్లైమాక్స్ సన్నివేశం మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందని అంటున్నారు. మార్చ్ 27 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.