Bhagyashree Borse : ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన భాగ్య శ్రీ భొర్సే(Bhagyashree Borse) కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. మిస్టర్ బచ్చన్ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే, అందులో నటించే హీరోయిన్స్ కనుమరుగు అయిపోతుంటారు. అలా ఇది వరకు ఎన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. కానీ భాగ్యశ్రీ కి మాత్రం యూత్ లో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఒకవిధంగా ఆ మిస్టర్ బచ్చన్ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ కూడా, కాస్త కలెక్షన్స్ వచ్చాయి అంటే అందుకు కారణం భాగ్యశ్రీ నే అని ట్రేడ్ విశ్లేషకులు సైతం అనేవారు. మిస్టర్ బచ్చన్ తర్వాత ఆమె చేసిన ‘కింగ్డమ్’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆమె రామ్ పోతినేని(Ram Pothineni) తో కలిసి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే చిత్రం లో నటించింది.
షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రొమోషన్స్ ని మొదలు పెట్టారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో భాగ్యశ్రీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. యాంకర్ శ్రీముఖి ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ సినిమా ఒక అభిమాని ఆత్మకథ గా తెరకెక్కించారు కాబట్టి, తెలుగు ఆడియన్స్ పై మీకు ఉన్న ఫీలింగ్ ఏమిటి’ అని అడగ్గా, దానికి భాగ్యశ్రీ సమాధానం చెప్తూ ‘నేను పుట్టి పెరిగింది మొత్తం నార్త్ ఇండియా లోనే, సౌత్ ఇండియా లో ఉండే ఫ్యాన్ కల్చర్ ని నేను చిన్నప్పటి నుండి నార్త్ ఇండియా లో చూడలేదు, కానీ నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ ని, ఆయన మీద అభిమానులు చూపించే ప్రేమ ని చూసి షాక్ కి గురయ్యాను, రామ్ కూడా ఇక్కడ అభిమానులు తమ అభిమాన హీరోల కోసం ఏమేమి చేస్తారో చెప్పాడు. అవన్నీ విని నేను షాక్ కి గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
When I came down here, I got to see the fan culture for @PawanKalyan Garu. I was in shock
– #BhagyaShriBorse pic.twitter.com/6nykEcgDU0
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) November 8, 2025