Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు థియేటర్లో రవితేజ కూతురు రచ్చ… వైరల్ ఫొటోలు

టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుందని. సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువై సాగదీతకు గురైందని అంటున్నారు. జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకు మైనస్ అంటున్నారు.

Written By: NARESH, Updated On : October 21, 2023 7:24 pm

Tiger Nageswara Rao

Follow us on

Tiger Nageswara Rao: మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. దసరా కానుకగా అక్టోబర్ 20న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఒకప్పటి స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు వంశీ కృష్ణ తెరకెక్కించాడు. రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటించింది. రేణూ దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆమె సామాజిక కార్యకర్తగా కనిపించారు. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, నాజర్, జిషు సేన్ గుప్తా కీలక రోల్స్ చేశారు.

టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుందని. సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువై సాగదీతకు గురైందని అంటున్నారు. జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకు మైనస్ అంటున్నారు. అయితే టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపిస్తుంది. సెలవు దినాలు కావడంతో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. అదే సమయంలో లియో, భగవంత్ కేసరి చిత్రాల నుండి గట్టి పోటీ ఎదుర్కొంటుంది.

కాగా టైగర్ నాగేశ్వరరావు థియేటర్లో రవితేజ పిల్లలు సందడి చేశారు. వారి సర్ప్రైజింగ్ విజిట్ ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది. ప్రేక్షకుల మధ్యలో టైగర్ నాగేశ్వరరావు సినిమా చూడాలని భావించిన రవితేజ కూతురు మోక్షద భూపతిరాజు, కొడుకు మహాదాన్ భూపతిరాజు హైదరాబాద్ లో ఓ థియేటర్లో సినిమా చూశారు. వీరు మాస్కులు ధరించి ఉన్న నేపథ్యంలో ఎవరూ గుర్తించలేదు.

అయితే కాసేపటికి ప్రేక్షకులు వాళ్ళు రవితేజ పిల్లలుగా పసిగట్టారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అవుతుంది. టైగర్ నాగేశ్వరరావు థియేటర్లో మోక్షద, మహాదాన్ ల కనిపించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. రవితేజకు ఇద్దరు పిల్లలు కాగా… అమ్మాయి పెద్దది. మహాదాన్ చిన్నవాడు. మహాదాన్ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్ర చేశాడు. యంగ్ గా కనిపించే రవితేజకు టీనేజ్ దాటిన పిల్లలు ఉన్నారంటే నమ్మడం కష్టమే…