O Bhaama Ayye Raama Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటుడు సుహాస్ (Suhas)…ప్రస్తుతం మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ‘కలర్ ఫోటో’ (Colour Photo) సినిమాతో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ఆయన ఆ మూవీతో సక్సెస్ సాధించాడు. ఇక ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండడం విశేషం…ఆయన ప్రస్తుతం ‘ఓ భామ అయ్యో రామా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రామ్ (సుహాస్) తన కెరీర్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. ఇక సినిమాలంటే కూడా అతనికి అసహ్యం పెరుగుతోంది. థియేటర్ బయట కూర్చుని సినిమా వాయిస్ వింటాడు తప్ప థియేటర్లో సినిమా అయితే చూడడు… అలాంటి రామ్ కి ఒక యాక్సిడెంట్ లో పరిచయమైన సత్యభామ(మాళవిక మనోజ్ ) కారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి రావాల్సి వస్తుంది. మరి యాక్సిడెంట్ అయిన సత్యభామ ఎవరు? ఎందుకు రామ్ ను అతనికి ఇష్టం లేని సినిమాల్లోకి తీసుకువస్తుంది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని ‘రామ్ గోదాల’ (Ram Godala) డైరెక్షన్లో తెరకెక్కింది. అయితే ఆయన మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమాని ఎంగేజింగ్ గా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశాడు. దాంతో పాటుగా మెయిన్ అనే క్యారెక్టర్ తో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ప్రాపర్ డ్రామా ఎమోషన్ అనేది హైలైట్ అవ్వకపోవడం వల్ల ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే అవకాశం అయితే లేకుండా పోయింది.
అలా కాకుండా ఆయన ఏదైతే కోర్ ఎమోషన్ తీసుకున్నాడో దాన్ని మెయిన్ లీడ్ గా చేసుకొని మరో సబ్ ప్లాట్ వేసుకొని చిన్న రిలాక్సేషన్ కోసం కొన్ని కామెడీ సీన్స్ ఆడ్ చేసుకొని ఒక ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చేసుకొని ముందుకు సాగితే సినిమా చాలా బాగా వచ్చేది. ఇక అతను అనుకున్న పాయింట్ రాసుకున్నప్పుడు బానే ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలోనే చాలా వరకు మిస్టేక్స్ అయితే చేశాడు. ఒక ఎమోషనల్ డ్రామాగా రావాల్సిన సినిమాని మధ్యలో క్యారెక్టర్స్ ని ఆడ్ చేసి ముందుకు తీసుకెళ్ళే ప్లాన్ చేయలేకపోయాడు.
ఇక మొత్తానికైతే సినిమా అనుకున్న రేంజ్ లో అయితే లేదు. ఇక సుహాస్ ఈ సినిమాని కాపాడలేకపోయాడనే చెప్పాలి. నిజానికి సినిమాలో కాన్ఫ్లిక్ట్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయినప్పుడే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ను సెట్ చేయడంలో దర్శకుడు కొంచెం తడబడ్డాడు. అలా కాకుండా ఇంటెన్స్ తో ముందుకు సాగితే సినిమా మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది…ఇక్కడ దర్శకుడు అది మిస్ అయ్యాడు. ముఖ్యంగా క్లారిటీ లేని కథనాన్ని రాశాడు. దాని వల్ల కూడా సినిమా ఎటెళ్తుందో ఏమవుతుందో అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఎదురైంది… రధన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ ని కనెక్ట్ చేయడంలో కానీ కొంతవరకు హెల్ప్ అయింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సుహాస్ బెస్ట్ యాక్టింగ్ ని కనబరిచే ప్రయత్నం చేశాడు. కానీ అది ఎలివేట్ అయ్యే విధంగా సీన్లు లేకపోవడం వల్ల ఆయన క్యారెక్టర్ కూడా చాలా వరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి… ప్రతి సీన్లో తన ఇంటెన్స్ డ్రామాని ప్రూవ్ చేయాలనే ప్రయత్నం చేసిన సుహాస్ ఆ సీన్లు ప్రేక్షకుడికి కనెక్ట్ కాకపోవడంతో ఆయన యాక్టింగ్ కూడా పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేకపోయింది… ఇక హీరోయిన్ గా చేసిన మాళవిక మనోజ్ సైతం డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో కనిపించింది.
ఆమె స్క్రీన్ మీద కనిపించినంత సేపు ప్రేక్షకుల్ని మైమరిపింపజేసే నటనతో మెప్పించింది… ఇక వీళ్లిద్దరు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొంతవరకు ప్రయత్నం చేసిన కూడా డైరెక్టర్ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల వీళ్ళ క్యారెక్టర్స్ కూడా అంత పెద్దగా ఎలివేట్ అయితే అవ్వలేదు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే రధన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా పెద్దగా ప్లస్ అయితే అవ్వలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ ఓకే అనిపించినట్టుగా ఉన్నప్పటికి ఇంకా ఎఫెక్టివ్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ గాని, మ్యూజిక్ గాని ఉంటే బాగుండేది అనే ఒక ఫీల్ అయితే సినిమా చూసినవాళ్ళకి కలుగుతోంది… ఇక మణికంధన్ అందించిన సినిమాటోగ్రఫీ కొంతవరకు పర్లేదు…ఎడిటింగ్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. కొన్ని అనవసరమైన సీన్లు తీసివేస్తే సినిమా మీద ఇంకాస్త ఇంటెన్స్ పెరగడమే కాకుండా సినిమా గ్రిప్పింగ్ గా వచ్చుండేది… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా లో ఓకే అనిపించేలా ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
సుహాస్ యాక్టింగ్
బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
సాంగ్స్
కొన్ని అనవసరపు సీన్స్
రేటింగ్
ఈ మూవీ కి మేమిచ్చే రేటింగ్ 2/5