Salaar Climax : దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. హీరో పాత్రను ఎలివేట్ చేయడంలో ఆయనకు మించినవాడు లేడు. గూస్ బంప్స్ అనే పదానికి ప్రశాంత్ నీల్ నిలువెత్తు నిదర్శనం. కెజిఎఫ్ సిరీస్లో రాఖీ పాత్రను ఆయన తీర్చిదిద్దిన తీరు ఎవరూ మర్చిపోలేరు. కెజిఎఫ్ సిరీస్ సక్సెస్ సీక్రెట్ కూడా అదే. అలాంటి దర్శకుడికి ప్రభాస్ వంటి మాస్ హీరో దొరికితే… సిల్వర్ స్క్రీన్ పై సునామే. వీరి కాంబోలో తెరకెక్కుతున్న సలార్ పై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సలార్ ని ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారని సమాచారం.
Salaar Climax : కెజిఎఫ్ 2 కి మించి… 400 మందితో సలార్ క్లైమాక్స్!
సలార్ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. క్లైమాక్స్ మాత్రమే మిగిలివుందట. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంటుందట. ఏకంగా నాలుగు వందల మంది ఫైటర్స్ తో ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. ప్రభాస్ గత చిత్రాల్లో లేని, చూడని యాక్షన్ ఎక్స్పీరియన్స్ సలార్ క్లైమాక్స్ తో ఇవ్వనున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సలార్ భారీ పాన్ ఇండియా మూవీ నేపథ్యంలో ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నారు. కెజిఎఫ్ మేకర్స్ సలార్ నిర్మాతలుగా ఉన్నారు.
సెప్టెంబర్ 28న సలార్ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. విడుదల వాయిదా పడనుందని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను మేకర్స్ ఖండించారు. మేము ప్రణాళికా బద్దంగా వెళుతున్నాం. ముందుగా ప్రకటించిన తేదీనే సలార్ విడుదల అవుతుంది . అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. కెరీర్లో మొదటిసారి ప్రభాస్-శృతి కాంబోలో మూవీ తెరకెక్కింది.
మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. జగపతిబాబు మరో కీలక రోల్ చేస్తున్నారు. కెజిఎఫ్ సిరీస్లో భాగమే సలార్ అనే ఓ వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ రోజుల వ్యవధిలో రెండు చిత్రాలు ఎంజాయ్ చేయనున్నారు. జూన్ 16న ఆదిపురుష్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. మరో మూడు నెలలకు సలార్ తో ప్రభాస్ ప్రేక్షకులను పలకరించనున్నారు.