Major- Vikram Movie: ఈ వీకెండ్ సినిమా లవర్స్ కి పండగే. శుక్రవారం విడుదలైన రెండు చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మేజర్, విక్రమ్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. చాలా అరుదుగా ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటాయి. జూన్ 3న అదే జరిగింది. అడివి శేష్ హీరోగా దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించిన మేజర్ అద్భుతం అంటున్నారు ప్రేక్షకులు. రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రయోగాత్మకంగా విడుదలకు ముందే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీమియర్స్ ప్రదర్శన జరిపారు.
ఫస్ట్ షో నుండే మేజర్ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. వెల్ మేడ్ బయోపిక్ గా మేజర్ ని క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు సైతం ఉన్ని కృష్ణన్ జీవిత కథకు కనెక్ట్ అయ్యారు. ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన మేజర్ కథ థియేటర్స్ లో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ నిర్మాతగా ఉన్నతమైన నిర్మాణ విలువలతో మేజర్ తెరకెక్కించారు.
Also Read: Anasuya Bharadwaj: బీచ్ లో లిప్ కిస్సులు హాట్ హగ్గులతో రెచ్చిపోయిన అనసూయ… వీడియో వైరల్!
అలాగే విక్రమ్ మూవీ వండర్స్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మాయ చేశాడు. ఎక్కడ కూడా నెమ్మదించని కథనం సినిమాను పరుగులు పెట్టించింది. చివరి సన్నివేశం వరకు ప్రేక్షకుడు కథలో మమేకం చేయడంలో కనకరాజ్ సక్సెస్ అయ్యాడు. మరోసారి తన తిరుగులేని ప్రతిభను నిరూపించుకున్నాడు. దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ కి ఓ కమర్షియల్ హిట్ కట్టబెట్టాడు. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటనలో కమల్ తో పోటీపడ్డారు. ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప యాక్షన్ ఎంటర్టైనర్ గా విక్రమ్ ని అభివర్ణించవచ్చు.
కాబట్టి సినిమా ప్రేమికులు ఈ వీకెండ్ మేజర్, విక్రమ్ చిత్రాలతో పండగ చేసుకోనున్నారు. రెండు చిత్రాలు పోటీ పడి ప్రేక్షకులను థియేటర్స్ వైపు నడిపించాయి. దానికి ఈ చిత్రాలకు వచ్చిన ఓపెనింగ్స్ నిదర్శనం. ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2, సర్కారు వారి పాట చిత్రాల తర్వాత బాక్సాఫీస్ కి కళ తెచ్చిన చిత్రాలుగా విక్రమ్, మేజర్ నిలిచాయి.
Also Read:Pawan Kalyan and Nagababu: పవన్ కళ్యాణ్, నాగబాబూ ఇద్దరి టార్గెట్ అదే