ఈ వీకెండ్ ఓటీటీ సినిమాలు.. ఏది బాగుంది ?

కరోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా గ‌తేడాది నుంచి థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి చేయాల్సిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్నాయి. కోవిడ్ క్లిష్ట స‌మ‌యంలో నిర్మాతలకు భరోసా ఇస్తూ ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని పంచి పెడుతున్నాయి ఓటీటీ సంస్థలు. పైగా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, ట్రెండింగ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లతో పాటు వెబ్ ఫిల్మ్స్ ను కూడా నిర్మిస్తూ ఓటీటీ సంస్థలు ఈ కరోనా సెకెండ్ లాక్ డౌన్ లో బాగా ఉప‌శ‌మ‌నం కలిగిస్తున్నాయి. ఒకప్పుడు […]

Written By: admin, Updated On : June 5, 2021 1:59 pm
Follow us on


కరోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా గ‌తేడాది నుంచి థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి చేయాల్సిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్నాయి. కోవిడ్ క్లిష్ట స‌మ‌యంలో నిర్మాతలకు భరోసా ఇస్తూ ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని పంచి పెడుతున్నాయి ఓటీటీ సంస్థలు. పైగా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, ట్రెండింగ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లతో పాటు వెబ్ ఫిల్మ్స్ ను కూడా నిర్మిస్తూ ఓటీటీ సంస్థలు ఈ కరోనా సెకెండ్ లాక్ డౌన్ లో బాగా ఉప‌శ‌మ‌నం కలిగిస్తున్నాయి.

ఒకప్పుడు శుక్ర‌వారం వచ్చింది అంటే చాలు.. థియేట‌ర్ల‌లలో అభిమానుల హడావుడి మొదలయ్యేది. ఇప్పుడు కూడా హడావుడి ఉంది, కాకపోతే తమ ఇంట్లోనే తమ చేతిలోని ఫోన్స్ లోనే ప్రేక్షకులు ఓటీటీలలో టైం పాస్ చేస్తున్నారు. పైగా తెలుగు చిత్రాల‌నే కాకుండా థ్రిల్ చేసే హాలీవుడ్‌, బాలీవుడ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుండటం విశేషం.

మరి ఈ వారం ఓటీటీలో ఏ ఏ సినిమాలు విడుద‌ల అయ్యాయి. మరి వాటిల్లో ఏమి బాగున్నాయో ఓ లుక్కేయండి.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ : అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ క్రేజీ సిరీస్ కి బాగా అలరిస్తోంది. రివ్యూస్ కూడా చాల బాగున్నాయి. అలాగే డామ్ (తెలుగు) అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే రిలీజ్ అయిన మరో సిరీస్ ఇది. కొత్తగా ట్రై చేసిన ఈ సిరీస్ ఆడియన్స్ ను బాగానే మెప్పిస్తుంది.

‘ర‌యా అండ్ లాస్ట్ డ్రాగ‌న్‌’ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ కూడా బాగుంది. ఇక బుక్ మై షో స్ట్రీమ్‌ లో విడుదలైన అడ‌వి పంది (తెలుగు) వెబ్ ఫిల్మ్ కొత్త కంటెంట్ తో పర్వాలేదనిపిస్తోంది. అలాగే బుక్ మై షో స్ట్రీమ్‌ లో రిలీజ్ అయిన మేడిన్ ఇట‌లీ, ది ఫ్ల‌డ్‌ కూడా బాగున్నాయి.

నెట్‌ ఫ్లిక్స్‌ లో రిలీజ్ అయిన సిరీస్ లు అండ్ వెబ్ ఫిల్మ్స్ కూడా బాగున్నాయి. వాటిల్లో చూడతగ్గ వాటిని ఈ కింద పొందుపరుస్తున్నాము.

హ్యూమ‌న్.. ది వ‌ర‌ల్డ్ విత్ఇన్‌: నెట్‌ఫ్లిక్స్‌

స్వీట్ టూత్: నెట్‌ఫ్లిక్స్‌

బ్రేకింగ్ ది బౌండ్రీస్‌: నెట్‌ఫ్లిక్స్‌

ఎక్స్‌ట్రీమ్‌: నెట్‌ఫ్లిక్స్‌

స్వీట్ అండ్ సోర్‌: నెట్‌ఫ్లిక్స్‌