Bellamkonda Suresh Reaction On Cheating Case: నిర్మాత బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్ పై చీటింగ్ కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదు అయిన చేసిన సంగతి తెలిసిందే. శరణ్ నుంచి తీసుకున్న రూ. 85 లక్షలను తిరిగి ఇవ్వకుండా.. మోసం చేశారు అని, డబ్బులు ఇవ్వకపోవడంతో శరణ్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో.. కోర్టు 406, 417, 420, 120 రెడ్‌విత్ 156 ఆఫ్ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

కాగా తాజాగా ఈ చీటింగ్ కేసు పై నిర్మాత బెల్లంకొండ సురేష్ స్పందించారు. 85 లక్షల రూపాయలు తీసుకున్నాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఈ ఆరోపణలు చేశారు. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చింది కోర్టు. శరణ్ ను లీగల్‌గా ఎదుర్కొంటాను. అతని వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు. త్వరలోనే అతని పేరు బయట పెడతాను ‘ అంటూ చెప్పుకొచ్చారు బెల్లంకొండ.
Also Read: ‘రాధేశ్యామ్’ నెగిటివ్ టాక్ పై థమన్ సెటైర్లు
పైగా బెల్లంకొండ. బాగా ఎమోషనల్ అవుతూ.. ‘నా పిల్లలు అంటే నాకు పంచ ప్రాణాలు. నేటి వరకూ వారికి ఎవరితోనూ గొడవలు లేవు. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ, అతడు నా కొడుకు జోలికి వచ్చాడు . అందుకే అతన్నివదిలిపెట్టను. లీగల్ గా అతన్ని ఎదుర్కుంటాను. పరువు నష్టం దావా వేస్తాను. అతని వెనకాల ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు. వాళ్ళ సంగతి కూడా చూస్తాను.

నాకు2018లో 85 లక్షలు ఇచ్చారట. మరి ఇప్పుడు ఎందుకు మేల్కొన్నారు ? నాకు రూపాయి ఇచ్చిన మోహమా అతనిది. లీగల్ గా అతనికి నరకం చూపిస్తాను. ఇవి ఆవేశంతో కాదు బాధతో చెప్తున్న మాటలు, ఈ మాటలను అతను వింటాడు. సాయి శ్రీనివాస్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే అతను ఇలా చేస్తున్నాడని అతనికి కూడా తెలుసు’ అన్నారు.
Also Read: బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్ !