https://oktelugu.com/

Bellamkonda Sreenivas: ఛత్రపతి రీమేక్ కి టైటిల్ కష్టాలు… అయోమయంలో బెల్లంకొండ

Bellamkonda Sreenivas: ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్‌ బాబు కుమారుడిగా ఈజీగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. వీవీ వినాయక్‌ లాంటి స్టార్ డైరెక్టర్ కలిసి “అల్లుడు శీను” మూవీతో అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ప్రభాస్ హీరోగా టాలీవుడ్ లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ తో బాలీవుడ్ లో పరిచయం కానున్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 06:11 PM IST
    Follow us on

    Bellamkonda Sreenivas: ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్‌ బాబు కుమారుడిగా ఈజీగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. వీవీ వినాయక్‌ లాంటి స్టార్ డైరెక్టర్ కలిసి “అల్లుడు శీను” మూవీతో అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ప్రభాస్ హీరోగా టాలీవుడ్ లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ తో బాలీవుడ్ లో పరిచయం కానున్నారు. తెలుగులో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా… హిందీలో వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతోంది.

    bellamkonda sreenivas chatrapathi hindi remake facing title issues

    Also Read: నవ్వుల రారాజు బ్రహ్మానందంను నవ్వించే వ్యక్తి ఎవరో తెలుసా?

    ‘ఛత్రపతి’ కథలో కొన్ని కీలకమార్పులు చేసి… బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చే విధంగా కొన్ని ఎలిమెంట్స్ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి టైటిల్ విషయంలో సమస్య తలెత్తుతోంది. ‘ఛత్రపతి’ అనే టైటిల్ తోనే హిందీలో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ టైటిల్ ను ఎవరో రిజిస్టర్ చేయించుకున్నారు. శివాజీ, ఛత్రపతి ఈ రెండు టైటిల్స్ మాత్రమే సినిమాకి సూట్ అవుతాయని దర్శకుడు వినాయక్ భావిస్తున్నాడు. అందుకే ‘ఛత్రపతి’ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్న నిర్మాతతో బేరసారాలు జరుపుతున్నారు. టైటిల్ వదులుకోవాలంటే సదరు నిర్మాత రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. దీంతో వినాయక్ అండ్ కో ఆలోచనలో పడింది అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. టైటిల్ రిజిస్టర్ చేయించిన తరువాత ఆరు నెలల్లో సినిమా మొదలుపెట్టకపోతే… ఆ టైటిల్ ను వేరే వాళ్లకు ఇచ్చేస్తారు. కానీ బాలీవుడ్ అలాంటి సదుపాయాలు లేవు.

    Also Read: స్పందించని వకీల్ సాబ్.. సీఎం సాబ్ పై మంటే కారణమా !