Homeఎంటర్టైన్మెంట్Bellamkonda Sai Srinivas engagement : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సతీమణి బ్యాక్ గ్రౌండ్ ఇదా.....

Bellamkonda Sai Srinivas engagement : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సతీమణి బ్యాక్ గ్రౌండ్ ఇదా.. మామూలు రేంజ్ కాదుగా..

Bellamkonda Sai Srinivas engagement : ప్రముఖ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellam Konda Sai Srinivas) నిన్న గ్రాండ్ గా కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కాసేపటి క్రితమే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్లోడ్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. కొద్దిరోజుల క్రితమే తన కాబోయే భార్య కావ్య ని తన మిత్రులకు పరిచయం చేస్తూ ఒక స్పెషల్ ఈవెంట్ ని ఏర్పాటు చేసాడు శ్రీనివాస్. చాలా మంది ఆ ఈవెంట్ ని చూసి , నిశ్చితార్థం అని పొరపాటు పడ్డారు. కానీ అసలైన నిశ్చితార్థం నిన్న జరిగింది. అయితే ఈ సందర్భంగా శ్రీనివాస్ ఎంతో ఉత్సాహం గా పోస్ట్ చేస్తూ ‘ఈ క్షణం నుండి నా జీవితం లో ప్రతీ ఒక్కటి మారిపోయింది. స్వచ్ఛమైన హృదయాలతో , ఒకరి కళ్ళలోకి ఒకరు మాత్రమే చూసుకుంటూ,మేము ఎల్లప్పుడూ నమ్మిన శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాం.ఎటువంటి హడావిడి లేదు, తొందర లేదు… కేవలం ప్రేమ, ఇది కేవలం నిశ్చితార్థం కాదు,ఇది కాలాతీతమైన ఒక బంధానికి నాంది’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీనివాస్.

బెల్లంకొండ శ్రీనివాస్ కి కావ్య రెడ్డి తన అక్క ద్వారా పరిచయమైంది అట. ఎందుకంటే కావ్య రెడ్డి శ్రీనివాస్ అక్క క్లాస్ మేట్ అట. అలా ఆమె కోసం అప్పుడప్పుడు ఇంటికి వస్తూ, శ్రీనివాస్ కి కూడా బాగా దగ్గరైంది. అలా దగ్గరైన వీళ్ళు స్నేహితులుగా మొదలై , నేడు ప్రేమ జంటగా మారి పెళ్లి చేసుకునేవరకు వచ్చింది. కావ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్ వివరాల విషయానికి వస్తే , ఈమె తండ్రి సినీ ఇండస్ట్రీ కి చెందినవాడు కాదు. నాంపల్లి హై కోర్ట్ లో టాప్ మోస్ట్ లాయర్స్ లో ఒకరు. మన టాలీవుడ్ లో ఎంతో మంది ప్రముఖ హీరోలకు ఈయన లీగల్ అడ్వైజర్ గా కూడా పని చేస్తున్నాడు. ఇక కావ్య రెడ్డి తాత గతం లో జడ్జీగా కూడా పని చేసాడట.

ఇక కావ్య రెడ్డి విషయానికి వస్తే, ఈమె ఒక ప్రముఖ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగ గా పని చేస్తోంది. ఈమె వచ్చిన తర్వాతే బెల్లంకొండ శ్రీనివాస్ జీవితం లో అనూహ్య మార్పులు వచ్చాయని, కుటుంబం లో చాలా మంచి కార్యక్రమాలు జరిగాయని అంటున్నారు. ఇకపోతే కెరీర్ లో ఒకప్పుడు కాస్త ఇబ్బందులను ఎదురుకున్న శ్రీనివాస్, ఇప్పుడు ‘కిష్కిందకాండ’ లాంటి భారీ హిట్ తో మల్లి ఫార్మ్ లోకి వచ్చేశాడు . పెళ్లి తర్వాత ఆయన కెరీర్ ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version