Behindwoods Awards 2025: రెహమాన్ మ్యూజిక్ అంటే ప్రాణం పెట్టి వింటారు కొందరు.. శివమణి డ్రమ్స్ కొడుతుంటే చెంగున ఎగురతారు.. కానీ అలాంటి మహామహులే షాక్ అయ్యేలా కీబోర్డ్ ప్లేయింగ్ చేశాడో మ్యూజిషియన్. ఆయన కీ బోర్డ్ ప్లేయింగ్ చేస్తుంటే చూపు చూపు తిప్పకోలేమం అన్నట్లగా సాగుతుంది. ఇటీవల Behindwoods Awards 2025 సందర్భంగా ఆయన చేసిన ఫర్ఫామెన్స్ కు అక్కడున్నవాళ్లంతా ఫిదా అయిపోయారు. అంతేకాకుండా మన తెలుగు సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు. ఇంతకీ ఈయన గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
మంచు మోహన్ బాబు, విష్ణు, ప్రభాస్ నటించిన ఇటీవల రిలీజ్ అయిన ‘కన్నప్ప’ గురించి తెలియని వారు ఉండరు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసింది స్టీఫెన్ దేవస్సీ(Stephen Devassy).ఈయనకు సంబంధించిన కొన్ని వీడియోలు చూస్తే రోమాలు నిక్కబొడుస్తాయి. Behindwoods Awards 2025 ఫంక్షన్లో ఆయన వాయించిన కీబోర్డ్ చూసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు షాక్ అయ్యారు.
స్టీఫెన్ దేవస్సీ కేరళలోని పాలక్కాడ్ లో 1981 ఫిబ్రవరి 23న జన్మించారు. చిన్న వయసులోనే మ్యూజిక్ అంటే అతనికి బాగా ఇష్టం. మద్రాసులోని ఆడియో టెక్నాలజీ స్కూల్ లో తన కెరీర్ ను ప్రారంభించాడు. 18 సంవత్సరాల వయసులో ఉండగానే జానీ సాగరిక నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఈ ఆల్బమ్ లోని పాటలకు ఆర్కెస్ట్రా వాయించాడు. ఆ తరువాత యూరోపియన్ పర్యటనలో హరిహరణ్ క తోడుగా కీబోర్డ్ వాయించాడు. ఆ తరువాత సింగర్ గా మారి ‘జిందగని’ అనే అల్బమ్ ను సొంతంగా రిలీజ్ చేశాడు.
Also Read: లవ్ ఫెయిల్యూర్ తో దేవదాసైన జబర్దస్త్ కమెడియన్… కోట్లు ఉన్నా అలాంటి జీవితం గడుపుతున్న సన్నీ!
ఇలా చిన్న వయసులోనే పాపలర్ అయిన ఈయన తొలిసారి ‘హరిహరన్ పిళ్లై హ్యాపీ’ అనే మలయాళ చిత్రానికి సంగీత డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తరువత పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. అయితే తెలుగులోనూ స్టీఫెన్ దేవస్సీ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో రిలీజ్ అయిన ‘కన్నప్ప’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇందులో ‘శివ శివ శంకరా’ అనే పాటతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.