Beggar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh)… ఒకప్పుడు ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆ మూవీ కోసం చాలా ఆసక్తి ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించడం లేదు. వరుసగా డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లాంటి తమిళ్ స్టార్ హీరో తో బెగ్గర్ (Beggar) అనే టైటిల్ ని పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడట. దాంతో సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే పూరి జగన్నాథ్ కి కాస్లి వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో చేయబోతున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
Also Read : పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!
మరి తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. పూరి లాంటి దర్శకుడు ఫ్లాపుల్లో ఉన్నప్పటికి ఆయన తలుచుకుంటే ఒక మంచి సక్సెస్ ని సాధించే సినిమాని ఈజీగా చేసేస్తాడు.
అంటూ అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అతని మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తూ మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి తో పాటు టబు, నివేదిత థామస్ లాంటి నటి నటులు కూడా నటించబోతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా అనేది పూరికి చాలా కీలకం. కాబట్టి వివిధ భాషల్లోని ఆర్టిస్టులను ఇందులో భాగం చేసి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను సాధించాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?