Salaar: మరి కాసేపట్లో సలార్ ట్రైలర్ విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలక విషయాలు వెల్లడించాడు. ఇండియాలోని క్రేజీ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు. కెజిఎఫ్ చిత్రాలతో ఆయన ఇమేజ్ బౌండరీలు బ్రేక్ చేసింది. కెజిఎఫ్ 2 ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాంటి దర్శకుడితో ప్రభాస్ మూవీ అనేసరికి హైప్ పీక్స్ చేరింది. సలార్ మూవీ కోసం జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ ఒక్కో విషయం లీక్ చేస్తూ ఆ హైప్ మరింతగా పెంచుతున్నాడు.
అసలు సలార్ ఐడియా 15 ఏళ్ల క్రిందట వచ్చిందని ఆయన అన్నారు. ఉగ్రం చిత్రం తర్వాత కెజిఎఫ్ సిరీస్ కోసం దాదాపు 8 ఏళ్ల సమయం పట్టిందట. సలార్ మూవీ ఐడియా కెజిఎఫ్ కంటే ముందే వచ్చినదని ఆయన అన్నారు. ప్రశాంత్ నీల్ కామెంట్ కొత్త అనుమానాలు లేవనెత్తింది. బహుశా కెజిఎఫ్ చిత్రాలతో సలార్ కి లింక్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ… సలార్ మూవీ ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేశాము.
సౌత్ ఇండియాలో గల మంగళూరు ఫోర్ట్, వైజాగ్ పోర్ట్ లో కొంత భాగం షూట్ చేశాము. సింగరేణిలో కొంత షూట్ చేశాము. సలార్ షూటింగ్ కి 114 రోజుల సమయం తీసుకుందిని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సలార్ కథ గురించి కూడా ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పటి మిత్రుల భద్ర శత్రువులుగా మారతారు. వారి మధ్య జరిగే పోరాటమే సలార్ అన్నారు.
సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ 5 భాషల్లో విడుదల కానుంది. నేడు సలార్ ట్రైలర్ విడుదల కానుంది. దేశం మొత్తం సలార్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తుంది. సలార్ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్ చేశారు. సలార్ 2 కూడా ఉంటుందని సమాచారం. సలార్ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంచనాలు ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి…