https://oktelugu.com/

Bigg Boss 7 Telugu Shubhashree: బిగ్ బాస్ లోకి బోల్డ్ బ్యూటీ శుభశ్రీ.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

ఒడిశా రాష్ట్రానికి చెందిన శుభశ్రీ స్కూల్ స్థాయి నుంచే స్పోర్ట్స్ లో ప్రావీణ్యురాలు. ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ సహా అన్ని ఆటల్లో ఆరితేరారు. కాలేజీ రోజుల్లో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. 2020లో విఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 4, 2023 / 11:15 AM IST

    Bigg Boss 7 Telugu Shubhashree

    Follow us on

    Bigg Boss 7 Telugu Shubhashree: బిగ్ బాస్ సీజన్ 7 టీం ఆసక్తిగా కరంగా ఉంది. ఈసారి ఎక్కువగా మాస్ మసాలకు ప్రిపరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అందాల తార షకీలతో పాటు మరికొంత మంది హాట్ భామలను ఎంపిక చేశారు. వీరిలో శుభశ్రీ ఒకరు. తెలుగు, తమిల్ లో ఎన్నో సినిమాల్లో నటించిన శుభ శ్రీ ఆ తరువాత హాట్ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె నటించిన ‘రుద్రవీణ’తో శుభశ్రీ పాపులారిటీ తెచ్చుకుంది. బేసిగ్గా లాయర్ వృత్తిలో కొనసాగిన శుభశ్రీ అందాలు ఆరబోయడంలో ఏమాత్రం తగ్గేదేలే అంటుంది. ఈ క్రమంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ శుభశ్రీ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె బ్యాగ్రౌండ్ విశేషాలేంటి? ఆ వివరాల్లోకి వెళితే..

    ఒడిశా రాష్ట్రానికి చెందిన శుభశ్రీ స్కూల్ స్థాయి నుంచే స్పోర్ట్స్ లో ప్రావీణ్యురాలు. ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ సహా అన్ని ఆటల్లో ఆరితేరారు. కాలేజీ రోజుల్లో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. 2020లో విఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది. ఆ తరువాత యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి అనేక లైవ్ షో లు నిర్వహించింది. ఈ తరుణంలో ఆమెకు తెలుగులో 2022లో రుద్రవీణ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత కల్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’లో ఓ పాత్రలో నటించింది. తమిల్ లో ‘డెవిల్’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

    ఓ వైపు లాయర్ గా వృత్తి కొనసాగిస్తూనే అందమైన నటిగా పేరు తెచ్చుకుంది శుభశ్రీ. అయితే ఆమె ఒడిశాకు చెందిన నటినే అయినా తెలుగు చక్కగా మాట్లాడుతుంది అని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా శుభ శ్రీ మాట్లాడుతూ తెలుగు కొంచెం ఉంది.. తెలివి ఎక్కువగా ఉంది.. అని కౌంటర్ ఇచ్చింది. స్పోర్ట్స్ లో ఎక్కువ ప్రావీణ్యం ఉన్న శుభశ్రీ బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ అమ్మడు ఏవిధంగా అలరిస్తుందో చూడాలి.